అదిరిపోయేలా రవితేజ మరియు వీరయ్య ఇంటర్వెల్..!!

-

బాబీ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వాల్తేరు వీరయ్య’  చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇందులో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా  ఈ సినిమా 13  రిలీజ్ ని అనౌన్స్ చేశారు రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మైత్రి మూవీ మేకర్స్ ‘వాల్తేరు వీరయ్య’ ప్రమోషన్స్ విషయంలో స్పీడ్ పెంచడానికి రెడీ అయ్యారు.

విశాఖ పట్టణంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా సూపర్ సక్సెస్ అయ్యింది. ఇక వీరయ్య ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ సాధిస్తోంది.అలాగే యూట్యూబ్ లో తమన్ సంగీతం అందించిన బాలయ్య సినిమా సాంగ్స్ కంటే దేవీశ్రీ మ్యూజిక్ అందించిన చిరు సినిమాకే ఎక్కువ వ్యూస్ వచ్చాయి.

ఇక ఈ సినిమా లో ఇంటర్వెల్ ఒక రేంజ్ లో ఉండి ఫ్యాన్స్ ను ఉర్రూత లుగిస్తుంది అని అంటున్నారు. అలాగే రవితేజ కారెక్టర్ విక్రమ్ రాథోడ్ లా ఉండి సూపర్ టఫ్ గా ఉంటుందని, రవితేజ కు చిరంజీవి కి మధ్య వచ్చే సన్నివేశాలు కూడా సూపర్ గా ఉంటాయని లీకులు అందుతున్నాయి. అసలే బాలయ్య బాబు కూడా సంక్రాంతి పండుగ బరిలో ఉండటం తో చిరు ఫ్యాన్స్ లో కొద్దిగా టెన్సన్ ఉండేది. కాని ఇప్పుడు ఈ విషయాలు విన్న తర్వాత ఫ్యాన్స్ బొమ్మ బ్లాక్ బస్టర్ అని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news