నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. BRO లో భారీగా ఖాళీలు…!

-

ఉదోగం కోసం చూస్తున్నారా…? అయితే మీకు శుభవార్త. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్- BRO భారీగా ఖాళీలను భర్తీ చేస్తోంది. ఆసక్తి, అర్హత వున్న వాళ్ళు అప్లై చెయ్యచ్చు. ఇక పూర్తి వివరాల లోకి వెళితే… దీనిలో మొత్తం 459 ఖాళీలను ప్రకటించింది. జనరల్ రిజర్వ్ ఇంజనీరింగ్ ఫోర్స్‌లో మొత్తం 7 ట్రేడ్స్‌ లో ఈ ఖాళీలున్నాయి. పురుషులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలి.

ఇక ఖాళీల వివరాలని చూస్తే.. డ్రాఫ్ట్స్‌మ్యాన్- 43, సూపర్‌వైజర్ స్టోర్- 11, రేడియో మెకానిక్- 4, ల్యాబ్ అసిస్టెంట్- 1, మల్డీ స్కిల్డ్ వర్కర్ (మేసన్)- 100, మల్డీ స్కిల్డ్ వర్కర్ (డ్రైవర్ ఇంజిన్ స్టాటిక్)- 150, స్టోర్ కీపర్ టెక్నికల్- 150 పోస్టులున్నాయి.

ఇది ఇలా ఉంటే అప్లై చేయడానికి 2021 ఏప్రిల్ 4 చివరి తేదీ. పూర్తి వివరాలని అధికారిక వెబ్‌సైట్ http://bro.gov.in/ లో చూడొచ్చు. దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసి, పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి ఇచ్చిన అడ్రెస్ కి పంపాలి. విద్యార్హతల వివరాలు చూస్తే టెన్త్, ఇంటర్, డిగ్రీ పాస్ అయినవారు అప్లై చేయొచ్చు.

అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 ఏళ్ల లోపు ఉండాలి. పోస్టుల ఆధారంగా వేతనం ఉంటుంది గమనించండి. అవసరమైన డాక్యుమెంట్స్, అప్లికేషన్ Commandant GREF Centre, Dighi Camp, Pune 411015 అడ్రస్‌కు పంపాలి. రాత పరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news