గుడ్ న్యూస్: ప్రభుత్వ విభాగంలో పలు ఖాళీలు.. ఇలా అప్లై చెయ్యండి..!

నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జైళ్ల శాఖ లో పలు ఖాళీలు వున్నాయి. అనంతపురం జిల్లా జైలు లో కాంట్రాక్ట్ పద్ధతి లో పలు ఖాళీల భర్తీ చేస్తోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. ఇందులో ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, నర్సు, ఎలక్ట్రిషియన్ మొదలైన పోస్టులని భర్తీ చేస్తున్నారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 06 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఫార్మసీలో డిప్లొమో/బీఫార్మసీ ఉత్తీర్ణత అయిన వారు ఈ పోస్టుకి అప్లై చేసుకోవచ్చు. అదే విధంగా ల్యాబ్ టెక్నీషియన్ విభాగంలో 1 ఖాళీ ఉంది. దీని కోసం టెన్త్, డీఎంఎల్టీ/బీఎస్సీ, ఎంఎల్టీ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అర్హులు.

నర్సింగ్ ఆర్డర్లీ గ్రేడ్-2 లో 3 ఖాళీలు ఉన్నాయి. టెన్త్ పాసైన మేల్/ఫిమేల్ ఈ పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ ఎయిడ్ కి సంబంధించి సర్టిఫికెట్ తప్పక ఉండాలి. అదే విధానగా ఒక ఎలక్ట్రీషియన్ పోస్ట్ కూడా భర్తీ చేస్తున్నారు. ఐటీఐ చేసిన వారు ఈ పోస్ట్ కి అర్హులు.

ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5 గంటలలోగ దరఖాస్తులను పంపించాలి. మెరిట్ మరియు రిజర్వేషన్ ఆధారంగా కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ నియామకాలు జరగనున్నాయి.
పర్యవేక్షణాధికారి, జిల్లా జైలు, అనంతపురం చిరునామాకు పంపాలి. పూర్తి వివరాలు ఈ లింక్ లో చూడండి. https://cdn.s3waas.gov.in/s333e8075e9970de0cfea955afd4644bb2/uploads/2021/05/2021053127.