మామిడి కాయల కోసం చెల్లిని చంపిన ఇద్దరు అక్కలు

జార్ఖండ్: పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలో దారుణం జరిగింది. మామిడి కాయల కోసం చెల్లిని ఇద్దరు అక్కలు చంపేశారు. అయితే వీరంతా మైనర్లు. హత్యకు గురైన బాలిక వయస్సు 6 ఏళ్లు కాగా చంపిన వారి వయస్సు ఒకరిది 12 ఏళ్లు, మరొకరిది 9 ఏళ్లు. మామిడి కాయల కోసం ముగ్గురు బాలికలు మామిడి తోటలోకి వెళ్లారు. కాయలు పంచుకునే విషయంలో 6 ఏళ్ల బాలికకు, ఇద్దరు అక్కల మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహం చెందిన ఇద్దరు అక్కలు.. చెల్లి అనే విషయాన్ని మరిచిపోయి గొంతు నులిమి చంపేశారు. బయటకు తెలియకుండా చెల్లి మృతదేహాన్ని అక్కడే పూడ్చి పెట్టారు. అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఆరా తీయడంతో ఇద్దరు అక్కలు అసలు విషయం బయటకు చెప్పారు. పాకుబెరా గ్రామంలో ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న చక్రధర్‌పూర్‌ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. నిందితులైన మైనర్లపై భారతీయ శిక్షాస్మృతిలోని 302, 201 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.