ఎస్సై జాబ్ సాధించాలనుకునే వారికి గుడ్ న్యూస్… ఇలా దరాఖాస్తు చేసుకోండి..!

Join Our Community
follow manalokam on social media

ఎస్సై జాబ్ పొందాలి అనుకునే వాళ్లకి శుభవార్త. సిఐఎస్ఎఫ్ ( central industrial Security Force)  ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. కేవలం ఎక్స్ ఆర్మీ వాళ్ళు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఎక్స్ ఆర్మీ పర్సనల్ నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో ఎస్ఐ, ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ ( జనరల్ డ్యూటీ), కానిస్టేబుల్( జనరల్ డ్యూటీ) పోస్టులను భర్తీ చేస్తోంది. ఇక ఈ పోస్టుల గురించి పూర్తి వివరాలు చూసేయండి.

మరిన్ని వివరాలకు www.cisf.gov.in/ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని, జతచేసి నోటిఫికేషన్ లో ఇచ్చిన ఈ మెయిల్ అడ్రస్ కు పంపాలి. మార్చి 15 చివరి తేదీ. ఇక పోస్టు వివరాల లోకి వెళితే… మొత్తం ఖాళీల సంఖ్య 2000. ఇందులో ఎస్ఐ 63, ఏఎస్ఐ 187, హెడ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ 424, కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ1326 ఉన్నాయి.

ఏదైనా ఇండియన్ ఆర్మీ లో లో రిటైర్ అయిన వారు అప్లై చేసుకోవాలి. పిఈటీ టెస్ట్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అలానే వయస్సు 50 ఏళ్ల లోపు ఉండాలి. వేతనం విషయానికి వస్తే.. ఎస్ఐ కి రూ.40000, ఏఎస్ఐ అయితే రూ.35000, హెడ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ కి రూ.30000, కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ అయితే రూ.25000 పొందొచ్చు.

 

 

 

TOP STORIES

ఎంఆధార్‌ యాప్‌ తో 35 రకాల ఆధార్ సేవలు… వివరాలు ఇవే..!

మీ ఫోన్ లో ఎంఆధార్‌ యాప్ వుందా...? అయితే మంచిగా 35 రకాల ఆధార్ సేవలు వున్నాయి. సులువుగా ఉపయోగించుకోండి. దీని వలన మీకు సూపర్...