కాకినాడ‌ డీసీసీబీలో 60 ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి…!

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. తూర్పు గోదావ‌రి జిల్లాలోని కాకినాడ‌ డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్‌ లో కొన్ని ఖాళీలు వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు అప్లై చెయ్యచ్చు. స్టాఫ్ అసిస్టెంట్/క్లర్క్, అసిస్టెంట్ మేనేజర్ విభాగాల్లో 60 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

jobs
jobs

ఇక ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాల లోకి వెళితే.. ఆన్ లైన్ పద్దతిలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాంక్ జాబ్స్ కి ప్రిపేర్ అయ్యే వారికి ప్లస్ అవుతుంది. బ్యాంక్ ప్రిప‌రేష‌న్ చేసే వారికి సేమ్ సెల‌బ‌స్‌తో ప‌రీక్ష ఉండ‌నుంది.

ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి డిసెంబ‌ర్ 3, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. కనుక ఈ లోగా అప్లై చేసుకోవడం మంచిది. ఈ పోస్టులకి దరఖాస్తు చెయ్యాలంటే http://kakinadadccb.in/recruitment/ ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. ఇక ఎలా దరఖాస్తు చెయ్యాలి అనేది చూస్తే..

ముందుగా అధికారిక వెబ్‌సైట్ http://kakinadadccb.in/recruitment/ ను ఓపెన్ చెయ్యండి.
అక్కడ నోటిఫికేషన్ ని చూడండి.
ఆ తరవాత మీరు అర్హులు అయితే Click Here to apply ఆప్ష‌న్‌పై క్లిక్ చేయాలి.
ఇప్పుడు మీకు https://ibpsonline.ibps.in/dccbasmoct21/ లింక్ ఓపెన్ అవుతుంది.
ఇక్కడ వివరాలని నింపి రిజ‌స్ట్రేష‌న్ అప్లికేష‌న్ ప్రాసెస్ పూర్తి చేయాలి.
జ‌న‌ర‌ల్/ ఓబీసీ అభ్య‌ర్థులు రూ.590 ప‌రీక్ష ఫీజు చెల్లంచాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీసీ/ ఈఎక్స్ఎస్ అభ్య‌ర్థులు రూ.413 ప‌రీక్ష ఫీజు చెల్లించాలి అంతే.

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి.