కంగనా రనౌత్ కు మరో షాక్.. తమ ముందు హాజరు కావాలని ఢిల్లీ అసెంబ్లీ సమన్లు

-

బాలీవుడ్ నటి, ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ సిక్కులపై సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. రైతుల ఉద్యమాన్ని ఖలిస్థానీ ఉద్యమంగా వర్ణించడం, సిక్కులను ఉగ్రవాదులుగా పోల్చడం దేశంలో తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఇప్పటికే ఆమెపై ముంబై లో కేసు నమోదైంది. సిక్కుల మనోభావాలను దెబ్బతీయడంతో పాటు, మతాన్ని కించపరుచుతూ వ్యాఖ్యలు చేయడంతో కేసు నమోదైంది.

తాజాగా ఢిల్లీ అసెంబ్లీ కూడా కంగనాకు షాక్ ఇచ్చింది. ఢిల్లీ అసెంబ్లీ ప్యానెల్ స‌మ‌న్లు జారీ చేసింది. సిక్కుల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన నేప‌థ్యంలో కంగ‌నాకు ఆ నోటీసులు ఇచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘ‌వ చ‌ద్దా ప్యానెల్ ముందు డిసెంబ‌ర్ ఆరో తేదీన హాజ‌రుకావాలంటూ ఆదేశించారు.  కాగా కంగనా రనౌత్ కూడా అంతే స్థాయిలో తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు తెలుస్తోంది. తాను కేసులకు భయపడేది లేదంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news