ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్-ESIC తెలంగాణ ఉద్యోగాల భర్తీ చేపట్టింది. 107 ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, స్పెషలిస్ట్, జూనియర్ రెసిడెంట్, సీనియర్ రెసిడెంట్ ఖాళీలు, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అధికారులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు మొత్తం సమాచారాన్ని తనిఖీ చేసిన తరువాత https://www.esic.nic.in/ వెబ్సైట్లో career సెక్షన్లో నోటిఫికేషన్ చూడొచ్చు. దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్ వివరాలు:
మొత్తం ఖాళీలు- 107
సీనియర్ రెసిడెంట్- 46
అసోసియేట్ ప్రొఫెసర్- 16
అసిస్టెంట్ ప్రొఫెసర్- 11
ప్రొఫెసర్- 11
సూపర్ స్పెషలిస్ట్ (నాన్ టీచింగ్)- 7
స్పెషలిస్ట్ నాన్ టీచింగ్- 10
జూనియర్ రెసిడెంట్- 3
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 అక్టోబర్ 24
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 అక్టోబర్ 29