రామ్ చరణ్ క‌న్నేశాడు… వెంకటేశ్ కొనేశాడు..

-

ఓ ప‌క్క వెంకీమామ షూటింగ్ చేస్తూనే మ‌రో ప‌క్క త‌మిళ మూవీ అసుర‌న్ రీమేక్ వైపు ఇంట్ర‌స్ట్ చూపుతున్నారు హీరో వెంక‌టేశ్‌. మల్టీస్టార‌ర్‌లో కూడా త‌న‌కంటూ ఒక మంచి ప్ర‌త్యేక‌త ఉండే పాత్ర‌ల్లో న‌టిస్తూ అల‌రిస్తున్న వెంకీ ప్ర‌స్తుతం ధనుష్, మంజు వారియర్ జంటగా తెరకెక్కిన అసురన్ సినిమా తెలుగులో రీమేక్ కానుంది. ఈ యాక్షన్ డ్రామాను వెట్రిమారన్ తెరకెక్కించారు. దసరా సెలవుల్లో తమిళనాట విడుదలై సంచలన విజయం సాధించింది అసురన్ చిత్రం. ఈ మధ్య కాలంలో కేవలం కథా ప్రాధాన్యం ఉన్న సినిమాలను మాత్రమే చేస్తున్న హీరో వెంకటేష్.. అసురన్ తెలుగు రీమేక్‌లో నటించబోతున్నారు.

కాగా అసురన్ తెలుగు వర్షన్‌ ను సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థల్లో సురేష్ బాబు, కళైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మించనున్నారు. అతి త్వరలో చిత్రయూనిట్ ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను తెలియజేయనున్నారు.

ఇక వెంకటేష్ ప్రస్తుతం నాగ చైతన్యతో కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘వెంకీ మామ’. కె. ఎస్.రవీంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది.

ఇక ఇదిలా ఉంటే తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా మంచి గుర్తింపు ఉన్న రామ్ చరణ్ తమిళ పరిశ్రమవైపు అడుగులు వేస్తున్నాడని తెలుస్తుంది. ధనుష్ హీరోగా నటించిన హిట్ సినిమా అసురన్ తెలుగులో రీమేక్ చేయనున్నాడని సమాచారం. మ‌రి ఇక రామ్‌చ‌ర‌ణ్ ఈ ప్రాజ‌క్ట్ వైపు చూడ‌కుండానే సురేష్‌ప్రొడ‌క్ష‌న్స్‌వాళ్ళు త‌న్నుకుపోయారా  రాంచ‌ర‌ణ్‌కి ఇదొక షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version