గుడ్ న్యూస్.. 2025 నాటికీ అమెజాన్ లో 20 లక్షల ఉద్యోగాలు..

-

ప్రముఖ ఆన్ లైన్ దిగ్గజ ఈ -కామర్స్​ సంస్థ అమెజాన్​  కంపెనీ రోజు రోజుకు అభివృద్ధి చెందుతుంది..వస్తు సేవల పరంగా కానీ,ఎంటర్‌టైన్‌మెంట్, ఉద్యోగ అవకాశాలలో నెంబర్ వన్ స్థానంలో ఉంది. ఇప్పటివరకు అమెజాన్ 11.6 లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నట్లు తెలిపారు..అంతేకాదు ఎగుమతుల విలువను 5 బిలియన్​ డాలర్లకు పెంచడం సహా 40 లక్షలకుపైగా ఎమ్​ఎస్​ఎంఈలను డిజిటలైజ్​ చేశామని పేర్కొంది..

అమెజాన్​ సంభవ్​ పేరుతో 2020 జనవరిలో జరిగిన వార్షికోత్సవంలో.. ‘2025 నాటికి దేశంలో 20 లక్షల ఉద్యోగాలను కల్పిస్తాము.అంతే కాదు ఇప్పుడు ఉన్న దానికన్నా ఎగుమతులను పెంచుకుంటూ వస్తాము అని 10 బిలియన్​ డాలర్లకు, కోటికిపైగా ఎమ్​ఎస్​ఎంఈలను డిజిటలైజ్​ చేస్తామని అమెజాన్​ వాగ్దానం చేసింది.

ఈ క్రమంలో ఆ ప్రకటనకు సంబంధించి ఇప్పటివరకు తాము చేపట్టిన చర్యలపై అమెజాన్​ ఆదివారం వివరాలను వెల్లడించింది. అమెజాన్​ పేర్కొంటున్న 11.6 లక్షల ఉద్యోగాల్లో కొన్ని నేరుగా సంస్థలో పనిచేసేవి కాగా మరికొన్ని దానికి అనుబంధంగా ఉండే రంగాలకు చెందినవి. డెలివరీ, లాజిస్టిక్స్​, రవాణా, ప్యాకేజింగ్​ మొదలైనవి ఈ కోవకు చెందినవే. గతేడాది జరిగిన వార్షికోత్సవంలో అమెజాన్​ సంభవ్​ వెంచర్​ పేరుతో వెంచర్​ క్యాపిటల్​ను కూడా ప్రారంభించింది. సాంకేతిక అభివృద్ధిపై దృష్టి సారించే స్టార్టప్స్​లో పెట్టుబడులు పెడతామని పేర్కొంది.

ఇప్పటికే మైగ్లామ్​, ఎం1ఎక్స్​ఛేంజ్​, స్మాల్​ కేస్​ మొదలైన సంస్థల్లో పెట్టుబడి పెట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న ఎంఎస్ఎంఈలతో కలిసి పనిచేస్తున్నారు.గతంలో కేవలం ఐటీ, ఈ-కామర్స్​, లాజిస్టిక్స్​, తయారీ, కంటెంట్​ క్రియేషన్, స్కిల్​ డెవలప్మెంట్​ వంటి రంగాల్లో 1,35,000 లక్షల ఉద్యోగాలను కల్పించాము..ఇప్పుడు పెంచుకుంటూ వస్తున్నాము.నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి..అమెజాన్ అభివృద్ధి త్వరగా జరగాలంటే ఉద్యోగుల సంఖ్య మరింత పెంచాలని అమెజాన్ ఎండి పేర్కొన్నారు..

Read more RELATED
Recommended to you

Latest news