ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో పలు ఖాళీలు వున్నాయి. ఆసక్తి, అర్హత వున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఖాళీగా ఉన్న డిప్లొమా ట్రెయినీ పోస్టులని భర్తీ చేయనున్నారు. దీనిలో మొత్తం 35 ఖాళీలు వున్నాయి. జూన్ 15లోగా అప్లై చేసుకోవడానికి అవకాశం వుంది. 75 శాతం మార్కులతో మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అర్హులు.
బీఈ/బీటెక్/ఎంటెక్ చేసిన అభ్యర్థులను డిప్లొమో అర్హత ఖచ్చితంగా ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 27,500 పాటు ఉపకారవేతనం అందించనున్నారు. ట్రైనింగ్ పూర్తైన తర్వాత రూ. 25,000-1,17,500 వరకు పే స్కేల్ ఉంటుంది.
ఇందులో డిప్లొమా ట్రెయినీ – ఎలక్ట్రికల్ విభాగంలో 30, డిప్లొమా ట్రెయినీ- సివిల్ విభాగంలో 5 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు వయస్సు జూన్ 15 నాటికి 27 ఏళ్లు మించకూడదు. అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ. 300ను దరఖాస్తు సమయంలో చెల్లించాల్సి ఉంటుంది.
ఇక ఎంపిక విధానం ఎలా ఉంటుంది అనేది చూస్తే.. రాత పరీక్ష లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులకు ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలు కోసం ఈ లింక్ లో చూడండి. https://careers.powergrid.in/Nr1DtRecruitment2021/docs/Detailed_Advertisement_Diploma_Trainee_2021.pdf