ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా..? అయితే మీకు శుభవార్త..! తాజాగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (GDC) కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2021 నోటిఫికేషన్ విడుదలైంది. అయితే మామూలుగా చూస్తే ఇది మార్చి 25వ తేదీన విడుదల అవ్వాలి. కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. అందుకని SAC ఇప్పుడు కొత్త నోటిఫికేషన్లు విడుదల చేస్తుంది.
మే మొదటి వారంలో అప్లికేషన్ ప్రాసెస్ మొదలవుతుంది. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాల లోకి వెళితే… కానిస్టేబుల్ GDS జీతం వచ్చేసి రూ. 21,700 నుండి 69,100 వరకు ఉంటుంది. గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి పదవ తరగతి పాస్ అయి ఉండాలి. ఆసక్తి, అర్హత వున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.
cbt test నిర్వహించిన తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ, ఫిజికల్ టెస్ట్ మరియు మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు. SSC కానిస్టేబుల్ GDS పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే… మొత్తం 25 ప్రశ్నలు 25 మార్కులు… వీటిలో జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ మరియు ఎలిమెంటరీ మ్యాథ్స్ మరియు హిందీ, ఇంగ్లీష్ ఉంటాయి.
మొత్తం పరీక్ష సమయం 1:30. జనవరి 2021 మొత్తం 55 ,915 సెలెక్ట్ అవ్వగా.. వాళ్లలో పురుషులు 47,582 మరియు స్త్రీలు 8,333. పూర్తి వివరాలని తెలుసుకోవాలంటే మీరు ssc.nic.in లో చూడచ్చు.