Friendship Day : ఇలాంటివి చేస్తే మంచి ఫ్రెండ్స్ ను ఎప్పటికీ మిస్ అవ్వరు..!!

-

మంచి నేస్తం ఒక మంచి పుస్తకం లాంటివాడు..మన కష్ట,సుఖాల లో తోడుండి..మనల్ని ముందుకు నడిపిస్తారు. అందుకే ఫ్రెండ్స్ అంటే మరో ప్రాణం అని చాలా మంది అంటారు..కని పెంచిన తల్లిదండ్రుల తర్వాత ఆ స్థానాన్ని ఫ్రెండ్స్ కు ఇస్తారు.ఒక్కో స్టేజ్ లో కొందరు ఫ్రెండ్స్ ఉంటారు.అందులో కొందరు మాత్రమే మనకు బాగా దగ్గర అవుతారు..వారికోసం ఏదైనా చెయ్యాలనిపిస్తుంది. అయితే కొన్ని పరిస్థితులు కారణం వారికి దూరం అవ్వాల్సి వస్తుంది.మళ్ళీ వెంటనే దగ్గర అవ్వాలంటే ఏం చెయ్యాలి.. ఈ ఫ్రెండ్షిప్ డే రోజు తెలుసుకుందాం..

మీరు వారి గురించి అడగడం, సమస్యలను తెలుసుకోవడం, బాధ్యతగా ఉండడం, ప్రాముఖ్యతని ఇవ్వడం చాలా ముఖ్యం. అదే విధంగా ఏదైనా సందర్బంలో వారికి అందుబాటులో లేకపోతే ఆ విషయాన్ని వారికి తెలియజేయండి.వారితో మాట్లాడేందుకు, వారికి సమయం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అదే విధంగా మీ విషయంలో ఆలోచించేందుకు కాస్తా టైమ్ ఇవ్వండి. కచ్చితంగా మీతో ఉండాలని ఆశించవద్దు. వారికి ఇష్టమైతే మీతో మళ్ళీ కనెక్ట్ అవుతారు. అప్పటివరకూ వెయిట్ చేయండి..

మీ ఫ్రెండ్ వర్చువల్‌గా కలిసి టచ్‌లో ఉండేందుకు ప్లాన్ చేయండి. ఇందుకోసం మీ గ్యాంగ్స్‌ అందరినీ కూడా పిలుచుకోవచ్చు. అదే విధంగా మీ క్లోజ్ ఫ్రెండ్‌తో పర్సనల్‌గా మాట్లాడితే మీ ఇద్దరి బంధం మరింత పెరుగుతుంది..మంచి ఫ్రెండ్స్ కూడా మన వెన్నంటే ఉంటారు.విడిపోయిన స్నేహాన్ని కలుపు కోవాలనుకున్నప్పుడు మొదట విడిపోవడానికి గల కారనాలను గుర్తుంచుకోండి. మీ స్నేహితులతో కమ్యూనికేట్ చేసేటప్పుడు నిజాయితీగా ఉండాలి..
మీ స్నేహన్ని తిరిగి ప్రారంభించాలనుకున్నప్పుడు మీరు ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయితే బాధపడొద్దు.

మీరు విడిపోయిన ఫ్రెండ్‌పై ఒత్తిడి తీసుకురావొద్దు. మీరు చేయాల్సిందల్లా మళ్ళీ కనెక్ట్ కావాలనే కోరికను వారికి తెలియజేయండి చాలు.. తిరిగి మీ ఫ్రెండ్షిప్ ప్రారంభమయ్యేందుకు సమయం పడుతుంది.
మానవ అనుభవంలో సామాజిక సంబంధాలు కీ రోల్ పోషిస్తాయి. సంతోషకరమైన, ఆరోగ్యకరమైన జీవితానికి బలమైన సంబంధాలు కీలకం. భారతీయ పెద్దలలో 34 శాతం మంది తమ ఫ్రెండ్షిప్ సర్కిల్‌ని విస్తరించుకోవాలని కోరుకుంటున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి..ఏ కష్టమొచ్చినా, ఎంత బాధలో ఉన్నా మంచి ఫ్రెండ్ ఉంటే చాలు వాటన్నింటికి ఎదురీగొచ్చు. అందుకే చిరకాల మిత్రులు ఉండాల్సిందే..మీకు ఉన్నవారితో మీరు సంతోషంగా ఉండండి.. హ్యాపీ ఫ్రెండ్‌షిప్‌ డే..

Read more RELATED
Recommended to you

Exit mobile version