ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) సంస్థ ఉద్యోగ నియామకానికై నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 47 ఇంజనీరింగ్ అసిస్టెంట్ మరియు టెక్నికల్ అటెండెంట్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. ఆసక్తిగల అభ్యర్థులు 15 జనవరి 2021లోగా ఆన్‌లైన్ ద్వారా ధరఖాస్తు చేసుకోవచ్చు.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్
ఇంజనీరింగ్ అసిస్టెంట్: 27 పోస్టులు
టెక్నికల్ అటెండెంట్: 20 పోస్టులు
ముఖ్యమైన తేదీ:
దరఖాస్తు ప్రారంభం: 22 డిసెంబర్ 2020
దరఖాస్తుకు చివరి తేదీ : 15 జనవరి 2021
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసిఎల్) ఇంజనీరింగ్. అసిస్టెంట్ మరియు టెక్నికల్ అటెండెంట్ ఖాళీ వివరాలు
ఇంజనీరింగ్ అసిస్టెంట్: అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ , ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ , ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ , ఇసిఇ , ఇటిఇ , ఎలక్ట్రానిక్స్ మరియు రేడియో కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ , ఐసిఇ , ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ప్రాసెస్ కంట్రోల్ ఇంజనీరింగ్ , కెమికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా లేదా ఐటిఐ పూర్తి చేసి ఉండాలి.
టెక్నికల్ అటెండెంట్: గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుండి మెట్రిక్ ,10వ తరగతి మరియు ఐటిఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 18 ఏళ్ల నుంచి 26 ఏళ్లకు మించకూడదు.
ఎంపిక ప్రక్రియ,ఎంపిక విధానం : రాత పరీక్ష , నైపుణ్యాల పరీక్ష , శారీరక పరీక్ష ఆధారంగా ఉంటుంది.
ఇంజనీరింగ్ అసిస్టెంట్ (మెకానికల్), ఇంజనీరింగ్ అసిస్టెంట్ (ఎలక్ట్రికల్), ఇంజనీరింగ్ అసిస్టెంట్ (టి అండ్ ఐ) మరియు ఇంజనీరింగ్ అసిస్టెంట్ (ఆపరేషన్స్) పోస్టులు గ్రేడ్ 4 కిందకి వస్తాయి. జీతం రూ. 25000 నుండి 105000 గా ఉంటుంది.
ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్:indianoilpipelines
అధికారిక వెబ్‌సైట్:iocl