బీఎస్ఎఫ్ లో గ్రూప్ బి పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్..

-

నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) లో గ్రూప్ బి పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 90 ఖాళీలను భర్తీ చేయనున్నారు..ఈ ఉద్యోగాలకు ఇంజనీరింగ్ పూర్తీ చేసిన వాళ్ళు అర్హులు.విభాగాల వారిగా ఖాళీల వివరాలను పరిశీలిస్తే ఆర్కిటెక్ట్ ఇన్ స్పెక్టర్ 1 ఖాళీ, సబ్ ఇన్ స్పెక్టర్ వర్క్స్ 57 ఖాళీలు, జూనియర్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ సబ్ ఇన్ స్పెక్టర్ 32 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 30 సంవత్సరాల లోపు ఉండాలి.

అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఇన్ స్పెక్టర్ ఆర్కిటెక్ట్ పోస్టుకు ఆర్కిటెక్చర్ లో డిగ్రీ ఉండాలి. వర్క్స్ సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టుకు సివిల్ ఇంజీనిరింగ్ లో మూడేళ్ల డిప్లొమా పాసై ఉండాలి. జూనియర్ ఇంజినీర్, సబ్ ఇన్ స్పెక్టర్ ఎలక్ట్రికల్ పోస్టుకు ఇంజినీరింగ్ లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి..

ఎంపిక విధానం:

రాత పరీక్ష , ఇంటర్వ్యూ, శారీరక సామర్ధ్యం అధారంగా ఎంపిక చేస్తారు.

ఉద్యోగాలకు సంబంధించిన పూర్తీ వివరాలు..

దరఖాస్తు ఫీజుకు గాను జనరల్ అభ్యర్ధులు 200రూ, యువతులు, ఎస్సీ, ఎస్టీ, సర్వీస్ లో ఉన్న వారికి, ఎస్స్ సర్వీస్ మెన్ కు ఫీజు రాయితీ వర్తిస్తుంది. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేది జూన్ 8, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ : rectt.bsf.gov.in ను చూడాలి..నోటిఫికేషన్ ను పూర్తిగా పరిశీలించిన తర్వాత అప్లై చేసుకోగలరు.

Read more RELATED
Recommended to you

Exit mobile version