చిత్తూరు జిల్లా ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో ఉద్యోగాలు… వివరాలివే..!

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. చిత్తూరు జిల్లా ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ ని విడుదల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా ఫార్మాసిస్ట్ గ్రేడ్‌-2 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. మొత్తం 26 పోస్టులు భ‌ర్తీ చేస్తున్నారు.

jobs
jobs

ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే… ద‌ర‌ఖాస్తుకు అప్లై చేయాల‌నుకొన్న అభ్య‌ర్థుల గ‌రిష్ట వ‌య‌సు 42 ఏళ్లు మించి ఉండ కూడ‌దు. ఈ ఉద్యోగాల‌ను ఔట్‌సోర్సింగ్ ప‌ద్ధ‌తిలో తీసుకోనున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబ‌ర్ 21, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

అర్హ‌త ప‌రీక్ష‌ లో సాధించిన మెరిట్ మార్కులు బట్టి ఎంపిక విధానం ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివ‌రాలు https://chittoor.ap.gov.in/ ను సంద‌ర్శించాలి. ఇక ఎలా అప్లై చేసుకోవాలనేది చూస్తే..

కేవ‌లం ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ను https://chittoor.ap.gov.in/ సంద‌ర్శించాలి
తరవాత నోటిఫికేష‌న్‌ను పూర్తిగా చ‌ద‌వాలి.
వెబ్‌సైట్ నుంచి అప్లికేష‌న్ డౌన్‌లోడ్ చేసుకొని, అనంత‌రం అప్లికేష‌న్ ఫాం నింపాలి.
ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి రూ.300 ఫీజు చెల్లించాలి.

ద‌ర‌ఖాస్తుల‌ను పంపాల్సిన చిరునామా: డీఎంహెచ్ఓ, చిత్తూరు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ కార్యాల‌యానికి పంపాలి.