టాలీవుడ్ కు ఊరట… టికెట్ల ధరల విషయంలో హై కోర్ట్ కీలక తీర్పు…

ఏపీలో గత కొంత కాలం నుంచి టికెట్ల రేట్ల విషయంలో తెలుగు సినీ పరిశ్రమకు.. ప్రభుత్వానికి మధ్య ప్రచ్ఛన్న యుద్దం నడుస్తోంది. సినిమా టికెట్ రేట్లను  తగ్గిస్తూ, బెనిఫిట్ షోలను నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్ 35ని తీసుకువచ్చింది. అయితే తాజాగా ఈ జీవో ను ఏపీ హైకోర్ట్ రద్దు చేసింది. పాత విధానంలోనే టికెట్ రేట్లను నిర్ణయించుకునే వెసులుబాటు ఉందని కోర్ట్ స్పష్టం చేసింది. కొత్త సినిమాలు వచ్చినప్పుడు టికెట్ ధరలను పెంచుకునే హక్కు థియేటర్లకు ఉందని పిటిషనల్ వాదించాడు, సినిమా బడ్జెట్ కు అనుగుణంగా టికెట్ రేట్లను నిర్ణయించుకునే అధికారం ఉందని పిటిషనల్ వాదించారు.. సినిమా టికెట్ రేట్లను తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. పిటిషనల్ వాదనలతో ఏకీభవించిన హైకోర్ట్ సినిమా టికెట్ల రేట్ల తగ్గింపు జీవో 35ని రద్దు చేసింది.

ఈ నిర్ణయం ద్వారా జగన్ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. గతంలో ఈ విషయంపై పలు మార్లు తెలుగు సిని ప్రముఖులు ప్రభుత్వంతో చర్చించినా.. ఫలితం లేకపోయింది. తాజాగా హైకోర్ట్ ఇచ్చిన తీర్పుతో టాలీవుడ్ కు ఉపశమనం కలిగింది. రానన్న ట్రిపుల్ ఆర్, భీమ్లానాయక్, పుష్ఫ వంటి భారీ బడ్జెట్ చిత్రాలకు అడ్డంకులు తొలిగినట్లు అయింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను పెంచుకునే అవకాశం ఏర్పడింది.