బీటెక్ పాస్ అయినవారికి గుడ్ న్యూస్… ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఇండియన్ ఆర్మీ ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు అప్లై చేసుకోచ్చు. బీటెక్ పాస్ అయినవారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

135వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ (TGC) 2022 కోసం దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది ఇండియన్ ఆర్మీ. ఎంపికైన వారికి 49 వారాల శిక్షణ ఉంటుంది. ఇది ఇలా ఉంటే మొత్తం 40 ఖాళీలు ఉన్నాయి. అప్లై చేసుకోవడానికి 2022 జనవరి 4 చివరి తేదీ. పోస్టుల వివరాలని నోటిఫికేషన్ లో చూడచ్చు.

ఇక విద్యార్హతల గురించి చూస్తే.. సంబంధిత బ్రాంచ్‌లో ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ కావాలి. బీటెక్ లేదా బీఈ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా అప్లై చేసుకునేందుకు అర్హులే. వయస్సు వివరాలలోకి వెళితే.. 2022 జూలై 1 నాటికి 20 నుంచి 27 ఏళ్లు. అంటే 1995 జూలై 2 నుంచి 2002 జూలై 1 మధ్య జన్మించిన వారు దరఖాస్తు చేయొచ్చు. షార్ట్‌లిస్టింగ్, ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేయనున్నారు. ఇక ఎలా అప్లై చేసుకోవాలి అనేది చూస్తే…

ముందు అభ్యర్థులు ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
Officers Entry Login పైన క్లిక్ చేయాలి.
రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయాలి.
డీటెయిల్స్ ని ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేయాలి.
ఇతర వివరాలతో దరఖాస్తు ఫామ్ పూర్తి చేయాలి.
ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.
ఫైనల్ గా అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version