ఇస్రోలో ఉద్యోగాలు.. ఐటీఐ చదివితే చాలు..

-

ఇస్రో.. ఈ రెండక్షరాల పేరు చెబితే దేశం గర్విస్తుంది. భారత దేశాన్ని అగ్రరాజ్యాల సరసన నిలబెడుతున్న సంస్థ ఇది. శాస్త్రసాంకేతిక రంగాల్లో భారత దేశాన్ని గర్వపడే స్థాయిలో నిలబెడుతోంది. అలాంటి సంస్థలో 90 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది.

ఇస్రోకు సంబంధించిన శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్) తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో మొత్తం 90 ఖాలీలు ఉన్నాయి. టెక్నీషియన్-బి గ్రూపుగా వీటిని పిలుస్తారు.

కార్పెంటర్, కెమికల్, ఎలక్టీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, పంప్ ఆపరేటర్, తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు ఆయా విభాగాన్ని అనుసరించి పదోతరగతి, సంబంధిత విభాగాల్లో ఐటీఐ ఉత్తీర్ణత అర్హతగా నిర్ణయించారు.

ఐటీఐతో పాటు ఎన్‌సీవీటీ సర్టిఫికేట్ కూడా ఉండాలి. స్క్రీనింగ్, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్ కేటగిరి వారికి 100 రూపాయల ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీసెమెన్, వికలాంగులకు ఫీజు ఉండదు.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసేందుకు ఆఖరు తేదీ.. 29.11.2019. మరిన్ని వివరాల కోసం షాక్
వెబ్ సైట్: www.shar.gov.in ను పరిశీలించవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news