కర్ణాటక, ఒడిశా విద్యార్థులకు మే 20 న‌ నీట్..!

-

రైలులో ప్రయాణించి రైలు ఆలస్యంతో పరీక్ష రాయలేకపోయిన విద్యార్థులకు మాత్రమే ఈ పరీక్ష నిర్వహిస్తారు. అదేవిధంగా ఒడిశాలో తుఫాను ప్రభావిత ప్రాంత విద్యార్థులకు నీట్‌ను నిర్వహించనున్నారు.

మే 5 దేశవ్యాప్తంగా వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎన్‌టీఏ నీట్ ఎగ్జామ్‌ను నిర్వహించిన విషయం అందిరికి విదితమే. అయితే కర్ణాటకలో ఉత్తర కర్ణాటక నుంచి బెంగళూరురు రైళ్లో బయలుదేరి పరీక్ష కోసం వస్తున్న సుమారు 500 మంది విద్యార్థులు రైలు ఆలస్యంతో పరీక్ష రాయలేకపోయారు.

ఈ విషయం జాతీయస్థాయిలో చర్చకు దారితీసింది. దీంతో కర్ణాటక సీఎం కేంద్ర మానవ వనరుల మంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లారు. దీంతో త్వరలో నిర్ణయం తీసుకుంటామని హెచ్‌ఆర్‌డీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రకటించారు. అయితే ఈ రోజు సాయంత్రం ట్విట్టర్‌లో మే 20న నీట్ ఎగ్జామ్‌ను నిర్వహిస్తామని ఆయన ట్వీట్ చేసారు. రైలులో ప్రయాణించి రైలు ఆలస్యంతో పరీక్ష రాయలేకపోయిన విద్యార్థులకు మాత్రమే ఈ పరీక్ష నిర్వహిస్తారు. అదేవిధంగా ఒడిశాలో తుఫాను ప్రభావిత ప్రాంత విద్యార్థులకు నీట్‌ను నిర్వహించనున్నారు.

కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version