డిగ్రీ పాస్ తో ‘NABCONS’ లో ఉద్యోగాలు…!

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగాను, రాష్ట్ర వ్యాప్తంగాను ఉద్యోగాల మేళా న‌డుస్తోంది. ఇటు ఏపీలో సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ఉద్యోగాల జాత‌ర చేస్తున్నారు. క్ర‌మం త‌ప్పకుండా వ‌రుస నోటిఫికేష‌న్ల‌తో ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క్రియ న‌డుస్తోంది. ఇక కేంద్ర ప్ర‌భుత్వం సైతం వివిధ కేంద్ర ప్ర‌భుత్వం సంస్థ‌ల్లో ఖాళీల‌ను వ‌రుస‌గా నోటిఫికేష‌న్లు రిలీజ్ చేస్తూ భ‌ర్తీ చేస్తోంది.

తాజాగా నాబార్డ్ అనుభంధంతో సబ్సిడరీ సంస్థ అయిన నాబ్ కాన్స్ ( నాబార్డ్ కన్సల్టెన్స్ ప్రవైట్ లిమిటెడ్ ) లో ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా అర్హులు అయిన అభ్యర్ధుల నుంచీ దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇవి పూర్తిగా కాంట్రాక్టు ఉద్యోగాలు మాత్ర‌మే. సీనియర్ లెవిల్ కన్సల్టెంట్, జూనియర్ లెవిల్ కన్సెల్టెంట్ వంటి పోస్తులని భర్తీ చేయనున్నారు.

పోస్టుల వివరాలు : సీనియర్ లెవిల్ కన్సల్టెంట్-1 జూనియర్ లెవిల్ కన్సెల్టెంట్-9

మొత్తం ఖాళీలు : 10

అర్హత : సంభందిత సబ్జెక్టులలో డిగ్రీ , ఎంబీయే పాస్ అయ్యిఉండాలి.
వయసు : 24 – 40 ఏళ్ళ మధ్య ఉండాలి.

ఎంపిక విధానం : షార్ట్ లిస్టు , ఇంటర్వ్యూ

దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌

చివరి తేదీ : 06-12-2019

మరిన్ని వివరాలకోసం : http://www.nabcons.com/