రైల్వేలో 3,378 ఉద్యోగాలు.. రేప‌టి నుంచే అప్లై చేయొచ్చు

ప్ర‌స్తుత క‌రోనా ప‌రిస్థితుల్లో చాలామంది జాబులు పోగొట్టుకుని, ఏ ప‌నుల్లేక ఖాళీగా ఉంటున్నారు. అస‌లు కొత్త‌గా ఏమైనా జాబులు ప‌డ‌తాయా అంటూ ఎద‌రుచూస్తున్నారు. అలాంటి వారికి స‌ద‌ర‌న్ రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ మేర‌కు సదరన్ రైల్వేలో 3378 అప్రెంటీస్ పోస్టుల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.

 

త‌న ప‌రిధిలోని పెరంబూర్, పొడనూర్‌లోని వర్క్‌షాప్‌లల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది స‌ద‌ర‌న్ రైల్వే. ఇందుకోసం జూన్ 1నుంచి అంటే రేప‌టి నుంచే అప్లికేష‌న్ ప్ర‌క్రియను స్టార్ట్ చేయ‌నుంది. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, వెల్డర్, టర్నర్ కేట‌గిరీల్లో పోస్టుల్ని భర్తీ చేయనుంది సదరన్ రైల్వే.

ప‌దో త‌ర‌గ‌తితో పాటు ఐటీఐ పాస్ అయినవారు ఈ జాబుల‌కు అర్హులు. అభ్య‌ర్థుల వ‌య‌స్సు 15 నుంచి 24ఏళ్ల లోపు ఉండాలి. డీటెయిల్డ్ నోటిఫికేషన్ జూన్ 1న వ‌స్తుంది. ఈ పోస్టుల‌కు సంబంధించిన పూర్తి వివరాలు, ఇత‌ర స‌మాచారం కోసం https://sr.indianrailways.gov.in/ వెబ్‌సైట్‌లో చూడాలి. ఈ పోస్టులకు అప్లై చేసుకోవ‌డానికి 2021 జూన్ 30 చివరి తేదీ.