తోడేళ్ళ నుంచి రక్షణకే ఈటెల ఢిల్లీ టూర్

తోడేళ్ళ దాడిని తప్పించుకోడానికి ఈటెల ఢిల్లీకి వెళ్ళాడు అని కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. కేసీఆర్.. పోలీస్, రెవెన్యూ అధికారులతో ఒత్తిడి పెంచాడు అని ఆయన ఆరోపించారు. దాన్ని తప్పించుకోడానికి ఈటెల ప్రయత్నం చేస్తున్నాడు అని ఈ సందర్భంగా వెల్లడించారు. కేసీఆర్ ఆధిపత్యం కోసం.. ఈటెల తోపాటు ఆయన భార్య జమున, కొడుకు, కోడలు పై కేసులు పెడుతున్నారు అని మండిపడ్డారు.

టీఆరెస్ ఫక్తు ఫాల్తూ పార్టీ గా మారింది అని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమకారులపై దాడి చేసినోళ్లే మంత్రులయ్యారు అని విమర్శలు చేసారు. టీఆరెస్ నుండి తప్పించుకోడానికి కేంద్రంలో వున్న బిజెపి వైపు ఈటెల చూస్తున్నారు అని ఆయన వ్యాఖ్యలు చేసారు.