నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 3479 టీచింగ్ పోస్టులు..!

-

ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఏకంగా 3479 టీచింగ్ పోస్టులు వున్నాయి. వివరాలని ఇప్పుడే చూసేయండి.. పూర్తి వివరాల లోకి వెళితే.. భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ దేశ వ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో వివిధ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

CRPF Recruitment 2020

ఆసక్తి, అర్హత వున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మొత్తం ఖాళీలు 3479 ఉండగా.. తెలుగు రాష్ట్రాల్లో 379 ఖాళీలు వున్నాయి. పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల లో బ్యాచులర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ తో పాటు బీఈడీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఇంగ్లీష్, హిందీ మీడియంలో టీచింగ్ ప్రొఫెషయన్సి ఉండాలి. దరఖాస్తు ఫీజు అయితే ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ పోస్టులకి రూ.2000 , పీజీటీ, టీజీటీ పోస్టులకు రూ. 1500 చెల్లించాలి. పోస్టుల వివరాల లోకి వెళితే.. ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ). కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 30/4/2021. పూర్తి వివరాలని https://tribal.nic.in లో చూడచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news