బీటెక్, ఎంసీఏ ఫ్రెషర్స్‌కు గుడ్ న్యూస్… క్యాప్ జెమిని లో ఉద్యోగావకాశాలు…!

-

ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ప్రముఖ టెక్ దిగ్గజం క్యాప్ జెమిని ఇంజనీరింగ్, ఎంసీఏ ఫ్రెషర్స్ కోసం నియామకాలు చేపట్టింది. కనుక ఆసక్తి, అర్హత వున్న వాళ్లు దీని కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది. క్యాంపస్ డ్రైవ్ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే… 2021లో ఇంజనీరింగ్, ఎంసీఏ పూర్తి చేసిన పట్టభద్రులు అక్టోబరు 15 లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

 

నమోదు చేసుకున్న వాళ్లకి వచ్చే నెల రెండో వారం నుంచి అసెస్మెంట్ టెస్ట్ ఉంటుంది. ఇక ఎవరు అర్హులు అనేది చూస్తే.. బీటెక్, ఎంసీఏ పట్టభద్రులు మాత్రమే ఈ నియామకాలకు అర్హులు. 2021లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారు లేదా గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

అలానే ఎంఈ లేదా ఎంటెక్ పూర్తి చేసినవారు కూడా అప్లై చెయ్యచ్చు. కానీ తప్పక ఐటీ, ఇన్ఫర్మేషన్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ విభాగాలకు చెందినవారే అప్లై చెయ్యాలి. నియామక ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినవారికి క్యాప్ జెమినిలో 8 నుంచి 10 వారాల పాటు సెంట్రల్ ట్రైనింగ్ ప్రొగ్రాం ఉంటుంది. నూతన టెక్నాలజీలపై పనిచేసే అభిరుచి, తగిన నైపుణ్యం, విషయసాధన ఉంటే భవిష్యత్తు సుగమం చేసుకోవడానికి క్యాప్ జెమిని సరైన చోటు అని కంపెనీ అంది.

ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాల్లో 2,90,000 మంది ఉద్యోగులు ఈ టెక్ కంపెనీలో పని చేస్తున్నారు. ఒక్క భారత్ లోని 13 విభిన్న ప్రదేశాల్లో 1,50,000 మంది టీమ్ మెంబర్స్ విధులను నిర్వర్తిస్తున్నారు. పూర్తి వివరాలని క్యాప్ జెమిని అధికారిక పోర్టల్ లో తెలుసుకుని అప్లై చేసుకోచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news