మెగా ఫ్యామిలీకి షాక్‌.. బాల‌కృష్ణ‌ ఇంటికి మోహన్ బాబు, మంచు విష్ణు !

మా అర్టిస్ట్‌ అసోషియేషన్‌ ఎన్నికల వేడి ఏ మాత్రం తగ్గలేదు. మా ఎన్నికల ఫలితాలు వచ్చి దగ్గర దగ్గర నాలుగు రోజులు గడుస్తున్నా…. మా అర్టిస్ట్‌ అసోషియేషన్‌ సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. వరుసగా ప్రెస్‌ మీట్లు పెట్టి… ఒకరి పై మరోకరు మాటలు దాడులు చేసుకుంటున్నారు. దీంతో టాలీవుడ చిత్ర పరిశ్రమ మెగా ఫ్యామిలీ మరియు మోహన్‌ బాబు ఫ్యామిలీ లాగా మారిందని అందరూ అనుకుంటున్నారు.

ఇలాంటి తరుణంగా మోహన్‌ బాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. మరి కాసేపట్లో నందమూరి బాల కృష్ణ ఇంటికి డైలాగ్‌ కింగ్‌ మోహన్‌ బాబు మరియు మంచు విష్ణు వెళ్లనున్నారు. మా అసోషియేషన్‌ తాజా పరిణామాల దృష్ట్యా వీరిద్దరి భేటీకి ప్రాధాన్యత చోటు చేసుకుంది. మా అధ్యక్ష ఫలితాల అనంతరం తొలిసారి బాలకృష్ణను కలుస్తున్నారు మోహన్‌ బాబు. ప్రస్తుతం అసోషియేషన్‌ లో జరుగుతున్న పరిణామాలపై బాలకృష్ణ కు మోహన్‌ బాబు వివరించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. కాగా.. మా అసోషియేషన్‌ కు ప్రకాశ్‌ రాజ్‌ ప్యానెల్‌ సభ్యులు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.