విజ‌య‌న‌గ‌రం జిల్లాలో కాంట్రాక్టు ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి..!

-

ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. విజ‌య‌నగ‌రం జిల్లా వైద్య ఆరోగ్య‌శాఖ కార్యాల‌యం లో కొన్ని ఖాళీలు వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. ఇక ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. విజ‌య‌నగ‌రం జిల్లా వైద్య ఆరోగ్య‌ శాఖ కార్యాల‌యం లో 53 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుదల అయ్యింది.

 

jobs
jobs

దీనిలో స్టాఫ్ న‌ర్సులు , డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్లు, లాస్ట్ గ్రేడ్ స‌ర్వీస్ పోస్టుల‌ను కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న నియ‌మించ‌నున్నారు. అప్లై చేసుకోవడానికి సెప్టెంబ‌ర్ 30, 2021 ఆఖరి తేదీ. ఆఫ్‌ లైన్‌ పద్దతి లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా ఈ పోస్టుల‌కు సంబంధించి ప్రొవిజిన‌ల్ మెరిట్ లిస్ట్ అక్టోబ‌ర్ 5, 2021న విడుద‌ల చేస్తారు. ఫైన‌ల్ మెరిట్ లిస్ట్‌ను అక్టోబ‌ర్ 8, 2021న విడుద‌ల చేస్తారు. అపాయింట్‌మెంట్‌ను అక్టోబ‌ర్ 11, 2021న ఇస్తారు.

పోస్టుల వివరాల లోకి వెళితే.. మొత్తం 37 స్టాఫ్ న‌ర్సులు ఖాళీలు వున్నాయి. గుర్తిపు పొందిన యూనివ‌ర్సిటీలో ఇంట‌ర్ మ‌రియు జీఎన్ఎం/ బీఎస్సీ న‌ర్సింగ్ చేసి ఉండాలి. అలానే 9 డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్లు ఖాళీలు వున్నాయి. ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి. మూడు నెల‌లు కంప్యూట‌ర్ కోర్సు చేసిన స‌ర్టిఫికెట్ ఉండాలి. అలానే 7 లాస్ట్ గ్రేడ్ స‌ర్వీస్ పోస్టులు వున్నాయి. ప‌దో త‌ర‌గ‌తి లేదా అంత‌కు స‌మాన‌మైన కోర్సు చ‌దివి ఉండాలి. మెరిట్ ఆధారంగా అభ్య‌ర్థుల ఎంపిక ఉంటుంది. రిజ‌ర్వేష‌న్ విధానం పాటిస్తారు.

అధికారిక జిల్లా వెబ్‌సైట్: https://vizianagaram.ap.gov.in/notice_category/recruitment/

 

Read more RELATED
Recommended to you

Latest news