ఐఐటీ ఢిల్లీలో ఎన‌ర్జీ ఇంజ‌నీరింగ్ కోర్సు…!

-

విద్యార్థులకి గుడ్ న్యూస్. ఢిల్లీలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కొత్తగా ఒక అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ను స్టార్ట్ చేసింది. బీటెక్‌లో ఎనర్జీ ఇంజనీరింగ్ కోర్సు అది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. జేఈఈ అడ్వాన్స్‌డ్ 2021 కి అర్హత సాధించిన విద్యార్థులు దీనికి అర్హులు. నలభై మందితో ఇనిస్టిట్యూట్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ని స్టార్ట్ చేస్తున్నారు.

విద్యార్ధులకి అవసరమైన జ్ఞానం, నైపుణ్యాలను సన్నద్ధం చేయడానికి దీనిని తీసుకొచ్చారు. ప్ర‌స్తుతం ఈ విభాగంలో మంచి ప్లేస్‌మెంట్ అవకాశాలు కూడా వున్నాయి. ఇది ఇలా ఉంటే ఆర్థికాభివృద్ధి, పర్యావరణ స్థిరత్వంపై గణనీయమైన ప్రభావాలను కలిగి ఉన్నందున ఈ రంగం చాలా కీల‌కం అని డైరెక్టర్ ప్రొఫెసర్ వి రాంగోపాల్ రావు అన్నారు. అయితే ఈ ఇంధన రంగంలో విద్యార్థుల‌కు మంచి అనేక అవకాశాలు ఉన్నాయ‌ని అంటున్నారు.

కనుక ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకుంటే మంచిది. కెరీర్ పరంగా కూడా ఈ కోర్సు బాగుంటుంది. ఇంధన రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటివి కాకుండా అభ్యర్థులు ఈ రంగంలో ఉన్నత చదువులను ఎంచుకుంటారని ఇనిస్టిట్యూట్ తెలిపింది. జేఈఈ స్కోర్‌ను ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంధన రంగంలో వృత్తిని చేపట్టడానికి ఆసక్తి వున్నవాళ్లు ఈ కోర్సుని ఎంచుకుంటే మంచిది.

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి.

Read more RELATED
Recommended to you

Latest news