హైపర్‌ ఆదిపై దాడి : అందంతా ఫేక్‌ !

-

జబర్దస్త్‌ కామెడీ షోలో ఎంత మంది లీం లీడర్స్‌ ఉన్నా… కూడా హైపర్‌ ఆదికి ఉన్న క్రేజ్‌ వేరే లెవెల్‌. ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. పంచ్‌ పేలిందా లేదా అన్నట్లు దూసుకుపోతున్నాడు హైపర్‌ ఆది. జబర్ధస్థ్‌ ద్వారా సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు హైపర్‌ ఆది. అయితే.. ఆది రీసెంట్‌ గా ఓ ఈవెంట్‌ లో చేసిన స్కిట్‌ పరంగా అతనిపై దాడి జరిగిందని… కొన్ని వార్తలు వచ్చాయి.

టాలీవుడ్‌ పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ హీరో ఫ్యాన్స్‌ హైపర్‌ ఆదిపై దాడి చేశారని వార్తలు వస్తున్నాయి. అయితే.. దీనిపై తాజాగా క్లారిటీ వచ్చింది. అసలు ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. సమాచారం అందుతోంది. కావాలనే.. ఎవరూ హైపర్‌ ఆది పై తప్పుడు ప్రచారం చేశారని… తెలుస్తోంది. హైపర్‌ ఆది అంటే గిట్టని వారు ఈ ప్రచారాన్ని స్ర్పెడ్‌ చేశారని సమాచారం. కాగా… ప్రస్తుతం హైపర్‌ ఆది… రవితేజ… ధమాకా సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. అలాగే.. జబర్ధస్త్‌, శ్రీదేవీ డ్రామా కంపెనీ లాంటి షోలలో హైపర్‌ ఆది అందరిని కనువిందు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news