సొంత టూ వీల‌ర్ ఉంటే.. అమెజాన్‌లో ఈ జాబ్ మీరూ చేయ‌వ‌చ్చు..!

-

అమెజాన్ ఫ్లెక్స్ ప్రోగ్రామ్‌లో అభ్య‌ర్థులు ముందుగా రిజిస్ట‌ర్ చేసుకుంటే ప్యాకేజీల‌ను డెలివ‌రీ చేస్తూ సొమ్ము సంపాదించ‌వ‌చ్చు. అయితే ఈ ప్రోగ్రామ్ ద్వారా జాబ్ చేయాల‌నుకునే వారికి సొంత టూ వీల‌ర్ ఉండాలి.

ఫుల్ టైం ఉద్యోగం చేసినా వ‌చ్చే డ‌బ్బులు మీకు స‌రిపోవ‌డం లేదా..? అయితే మీలాంటి వారి కోస‌మే ప్ర‌ముఖ ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్ ఓ స‌ద‌వ‌కాశాన్ని అందిస్తోంది. ఆ సంస్థ‌లో మీరు పార్ట్ టైం జాబ్ చేస్తూ గంట‌కు రూ.140 వ‌ర‌కు సంపాదించుకోవ‌చ్చు. అమెజాన్ సంస్థ అమెజాన్ ఫ్లెక్స్ పేరిట ఔత్సాహికులైన వారి కోసం ఈ పార్ట్ టైం జాబ్ ఆఫ‌ర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని స‌హాయంతో ఎవ‌రైనా స‌రే.. ఎన్ని గంట‌ల పాటు అయినా పార్ట్ టైం జాబ్ చేసి డ‌బ్బులు సంపాదించుకోవ‌చ్చు.

అమెజాన్ ఫ్లెక్స్ ప్రోగ్రామ్‌లో అభ్య‌ర్థులు ముందుగా రిజిస్ట‌ర్ చేసుకుంటే ప్యాకేజీల‌ను డెలివ‌రీ చేస్తూ పైన తెలిపిన మొత్తాన్ని సంపాదించ‌వ‌చ్చు. అయితే ఈ ప్రోగ్రామ్ ద్వారా జాబ్ చేయాల‌నుకునే వారికి సొంత టూ వీల‌ర్ ఉండాలి. దీంతోపాటు ఆండ్రాయిడ్ ఫోన్ ఉండాలి. ఇక ప్యాకేజీలు డెలివ‌రీ చేసే ముందు అమెజాన్ అభ్య‌ర్థులకు కొంత శిక్ష‌ణ కూడా ఇస్తుంది. కాగా ప్ర‌స్తుతం ఈ ప్రోగ్రామ్‌ను బెంగ‌ళూరు, ముంబై, ఢిల్లీల‌లో మాత్ర‌మే ప్రారంభించారు. కానీ అతి త్వ‌ర‌లోనే దేశంలోని ప‌లు ఇత‌ర ప్రాంతాల్లోనూ ఈ ప్రోగ్రామ్‌ను అందుబాటులోకి తేనున్నారు.

కాగా ఇండియాకు అమెజాన్ ఫ్లెక్స్ కొత్త‌దే కానీ అమెరికాలో 2015లోనే ఈ ప్రోగ్రామ్‌ను లాంచ్ చేశారు. ఇప్పుడు దీన్ని మ‌న దేశంలో అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో వేలాదిమందికి ఉపాధి దొరుకుతుంద‌ని అమెజాన్ చెబుతోంది. పార్ట్ టైం లేదా ఫుల్ టైం ఎలాగైనా ఈ జాబ్ చేసుకునే వీలుండ‌డంతో నిరుద్యోగుల‌కు ఉపాధి ల‌భిస్తుందని అమెజాన్ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version