నిజమా.. ఏపీ సీఎం జగన్.. బాలకృష్ణ అభిమానా? వైరల్ ఫోటో

-

బాలకృష్ణ నటించిన సమరసింహారెడ్డి సినిమా రిలీజ్ అయి ఒక సంవత్సరం అయిన సందర్భంగా 2000 సంవత్సరంలో కడప జిల్లా బాలయ్య అభిమాన సంఘం ప్రెసిడెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఫోటోతో సహా పేపర్‌లో యాడ్ ఇచ్చినట్టుగా ఉంది ఆ ఫోటో.

ఏపీ రాజకీయాల్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య శతృత్వం ఈనాటిది కాదు. సీనియర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటినుంచి ఆరెండు పార్టీల మధ్య శతృత్వం ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికున్నన్ని రోజులు కూడా ఆ రెండు పార్టీల నాయకులు ఎప్పుడూ కొట్టుకునేవారు.. తిట్టుకునేవారు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. అప్పుడు డైరెక్ట్‌గా తిట్టుకునేవారు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి.. సోషల్ మీడియాలో ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకోవడం కామన్ అయింది.

అయితే.. తాజాగా ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఏపీ సీఎం జగన్, బాలకృష్ణకు సంబంధించిన ఫోటో అది. అది నిజమా? ఫేకా? అనేది తర్వాత మాట్లాడుకుందాం కానీ.. ఆ ఫోటో ప్రకారం బాలకృష్ణ నటించిన సమరసింహారెడ్డి సినిమా రిలీజ్ అయి ఒక సంవత్సరం అయిన సందర్భంగా 2000 సంవత్సరంలో కడప జిల్లా బాలయ్య అభిమాన సంఘం ప్రెసిడెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఫోటోతో సహా పేపర్‌లో యాడ్ ఇచ్చినట్టుగా ఉంది ఆ ఫోటో. అంటే.. జగన్ బాలకృష్ణ అభిమానా? ఈ విషయం ఇప్పటి వరకు జగన్ కూడా ఎక్కడా ప్రస్తావించలేదే? అసలు.. ఇన్నిరోజులు బయటికి రాని ఫోటో ఇప్పుడే ఎందుకు వచ్చింది. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడం వెనుక మర్మం ఏంటి? అని ఆలోచిస్తున్నారా? అవును.. మీరు ఆలోచించేది కరెక్టే.

ఈ ఫోటోను పచ్చ మీడియా కావాలని ఆ యాడ్‌ను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసిందట. వైఎస్సార్సీపీ శ్రేణులు అది ఫేక్ ఫోటో అని ఆధారాలతో సహా నిరూపించారు. ఫోటోలో ఉన్న వైఎస్ జగన్ ఫోటో 2000 సంవత్సరం నాటిది కాదని.. అది 2003లో తన భార్య భారతితో ఓ గార్డెన్‌లో తీసుకున్న ఫోటోను ఎడిట్ చేసి ఆ యాడ్‌లో పెట్టారని.. అసలు.. జగన్ ఎవ్వరికీ ఫ్యాన్ కాదని.. ఆయన ఏ హీరో అభిమాన సంఘానికి కూడా అధ్యక్షుడిగా లేరని.. కావాలని పచ్చ మీడియా చేస్తున్న దుష్ప్రచారం ఇది అని అంటున్నారు.

అయితే.. బాలకృష్ణకు జగన్ అనే వ్యక్తి అభిమాన సంఘం నాయకుడిగా ఉన్నాడని.. ఆయన పేరుకు బదులు.. వైఎస్ జగన్ పేరు వేసి కావాలని ముఖ్యమంత్రి మీద బురద జల్లుతున్నారంటూ వైఎస్సార్సీపీ శ్రేణులు పచ్చ మీడియాపై ఫైర్ అవుతున్నారు. మొత్తానికి సోషల్ మీడియాలో ఈ ఫోటోపై పచ్చ మీడియా, వైఎస్సార్సీపీ శ్రేణుల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version