మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఐటీఐ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఈ సంస్థ బెంగళూరు కేంద్రంగా విధులు నిర్వర్తిస్తోంది. మొత్తం 41 ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
చీఫ్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టులని భర్తీ చేస్తోంది. డేటా సెంటర్, నెట్‌వర్క్, సెక్యూరిటీ, డేటా సెంటర్ అండ్ సేల్స్ మార్కెటింగ్, ఆర్ అండ్ డీ విభాగాల్లో ఖాళీలు వున్నాయి. వయస్సు వచ్చేసి చీఫ్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు 45 ఏళ్లు, డిప్యూటీ మేనేజర్ పోస్టులకు 40 ఏళ్లు మించకూడదు.
అభ్యర్థులను మొదట అకాడమీ, అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. దరఖాస్తు చేసుకునే వారు కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్, సీఏ/ ఐసీడబ్ల్యూ ఉత్తీర్ణత ఉండాలి. పనిలో అనుభవం ఉండాలి.
ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోచ్చు. శాలరీ విషయానికి వస్తే.. చీఫ్ మేనేజర్ పోస్టులకు ఎంపికై వారికి నెలు రూ. 80,240, డిప్యూటీ మేనేజర్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 65,195 అందిస్తారు. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.itiltd.in/ వెబ్‌సైట్ చూడొచ్చు. దరఖాస్తులకు చివరితేది నవంబర్ 25, 2021. హార్డ్‌కాపీలు పంపడానికి నవంబర్ 29 చివరితేది.
హార్డ్ కాపీలను పంపాల్సిన చిరునామా: జనరల్ మేనేజర్-హెచ్‌ఆర్, ఐటీఐ లిమిటెడ్, ఐటీఐ భవన్ దూరవాణి నగర్, బెంగళూరు 560016.
ఎంట్రన్స్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్రభుత్వోద్యోగం మీ లక్ష్యమా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మరెన్నో ఇంట్రెస్టింగ్, వింతలు విశేషాలు, ప్రేరణాత్మక కథనాల కోసం మనలోకం.కామ్ ని ఫాలో అవ్వండి.