ఢిల్లీ పోలీస్ శాఖలో 5846 కానిస్టేబుల్ పోస్టులు.. దేశంలోని ఏ ప్రాంతం వారైనా.. ఇంటర్‌ పాసైతే చాలు

-

మీరు ఇంటర్ పాస్ అయ్యారా ? మంచి శారీరక ప్రమాణాలు ఉన్నాయా. యూనిఫాం జాబ్ కోసం ఎదురుచూస్తున్న వారికి సువర్ణావకాశం. కరోనా కాలంలో ఐదువేలకు పైగా పోస్టులకు నోటిఫికేషన్. దేశంలోని ఏ ప్రాంతం వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు. యాభైవేలకు పైగా జీతం. ఆ నోటిఫికేసన్ వివరాలు తెలుసుకుందాం…
ఢిల్లీ పోలీస్ విభాగంలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) నోటిఫికేషన్ను విడుదల చేసింది.

పోస్టు: కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్)
మొత్తం ఖాళీలు: 5846
వీటిలో కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పురుషులు-3659, మహిళలు-2187.
అర్హతలు: ఇంటర్ ఉత్తీర్ణత, పురుష అభ్యర్థులు అయితే లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
నిర్దేశిత శారీరీక ప్రమాణాలు తప్పనిసరి.
వయస్సు: 18-25 ఏండ్ల మధ్య ఉండాలి. రిజర్వ్డ్ వర్గాలకు ప్రభుత్వనిబంధనల ప్రకారం వయోపరిమితిలో రిలాక్సేషన్ ఇస్తారు.
ఎంపిక: కంప్యూటర్ బేస్డ టెస్ట్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, వైద్యపరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
పరీక్ష కేంద్రాలు: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూల్, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో ఉన్నాయి.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: సెప్టెంబర్ 7
సీబీటీ తేదీ: నవంబర్ 27 నుంచి డిసెంబర్ 14 వరకు.
వెబ్సైట్: https://ssc.nic.in

Read more RELATED
Recommended to you

Exit mobile version