బరోడా బ్యాంక్ లో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..!

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. వేర్వేరు విభాగాలలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి బరోడా బ్యాంక్ సిద్ధం అయ్యింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చెయ్యచ్చు.

 

ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ ఉద్యోగ ఖాళీలలో హెడ్‌(లార్జ్‌ కార్పొరేట్‌ రిలేషన్‌షిప్స్‌) 1, బిజినెస్‌ హెడ్‌ (కమర్షియల్‌ వెహికల్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ అండ్‌ మైనింగ్‌ ఎక్విప్‌మెంట్‌ ఫైనాన్స్‌) 1 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. అలానే బిజినెస్‌ హెడ్‌(లోన్‌ అగైనెస్ట్‌ ప్రాపర్టీ అండ్‌ అన్‌సెక్యూర్డ్‌ లోన్స్‌) ఉద్యోగ ఖాళీలు 1, వైస్‌ ప్రెసిడెంట్‌(ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ) 4 ఉద్యోగ ఖాళీలు వున్నాయి.

ఇక విద్యార్హత వివరాల లోకి వెళితే… బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఎంబీఏ పాసైన వాళ్లు హెడ్, బిజినెస్ హెడ్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వయస్సు వివరాలలోకి వెళితే.. 36 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు అప్లై చెయ్యచ్చు.

వైస్‌ ప్రెసిడెంట్‌(ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ) ఉద్యోగ ఖాళీలకు 32 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. పర్సనల్ ఇంటర్వ్యూ/గ్రూప్‌ డిస్కషన్‌ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. https://www.bankofbaroda.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి.