వివాహ వేడుకలో ఏపీ మంత్రి డ్యాన్స్.. వీడియో వైరల్

ఆంధ్ర ప్ర‌దేశ్ విద్యాశాఖ ఆదిమూల‌పు సురేష్ గురించి అంద‌రికీ తెలిసే.. ఉంటుంది. అయితే.. ఆయ‌న పెళ్లి వేడుక‌లో.. స్టెప్పులేసి.. ఇర‌గదీశాడు.అవును… మంత్రి ఆదిమూల‌పు సురేష్ త‌న కుమార్తె పెళ్లి వేడుక‌లో డ్యాన్స్ చేశ‌రు. సై సినిమాలో పాట‌కు కూతురు తో క‌లిసి స్టెప్పులు వేసి.. అంద‌రినీ ఆక‌ట్టుకున్నారు. మంత్రి సురేష్ డ్యాన్స్ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

హైద‌రాబాద్ లోని గోల్కొండ రిసార్ట్స్ లో జ‌రిగిన ఈ పెళ్లికి సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌తీమ‌ణి భార‌తి రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆ నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. అయితే.. ఈ నేప‌థ్యంలోనే.. మంత్రిగా, రాజ‌కీయ నేత‌గా రోజు వారీ కార్య‌క్ర‌మాల‌తో బిజీగా ఉండే ఆదిమూల‌పు సురేష్ ఇలా కుమార్తె పెళ్లి వేడుక‌లో స‌ర‌ద‌గా గ‌డిపారు. డ్యాన్స్ చేసి.. అంద‌రినీ ఉత్సాహ‌ప‌రిచారు. మంత్రి ఆదిమూల‌పు డాన్స్ ఇర‌గ‌దీశాడంటూ.. వైసీపీ నేత‌లు ఆ వీడియోను అంద‌రూ షేర్ చేస్తున్నారు.