టెన్త్, ఇంటర్ పూర్తి చేసిన వారికి గుడ్ న్యూస్..హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌ లో కొన్ని పోస్టులు ఖాళీగా వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే..

jobs

కేంద్ర ప్రభుత్వ గనుల మంత్రిత్వ శాఖకు చెందిన హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌ లో మొత్తం 54 ఖాళీలు వున్నాయి. పదో తరగతి, ఇంర్మీడియట్‌, డిప్లొమా, డిగ్రీ లేదా తత్సమాన కోర్సు ని పూర్తి చేసిన వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు.

ఇక పోస్టుల వివరాలని చూస్తే.. 54 మైనింగ్ మేట్, బ్లాస్టర్, డబ్ల్యూఈడీ ‘బి’, డబ్ల్యూఈడీ ‘సి’ పోస్టులు ఖాళీగా వున్నాయి. అలానే ఈ పోస్టులకి అప్లై చెయ్యాలంటే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. ఇక వయస్సు విషయానికి వస్తే.. అభ్యర్థుల వయస్సు డిసెంబర్‌ 1, 2022వ తేదీ నాటికి అభ్యర్ధుల వయసు 40 యేళ్లకు మించి వుండకూడదు. ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చెయ్యాల్సి వుంది. దరఖాస్తులు జనవరి 2 నుంచి మొదలు అవుతాయి.

ఇక శాలరీ విషయానికి వస్తే మైనింగ్ మేట్‌ పోస్టులకు రూ.18,480ల నుంచి రూ.45,400ల వరకు ఇస్తారు. బ్లాస్టర్‌కు, డబ్ల్యూఈడీ ‘బి’ పోస్టులకు రూ.18,180ల దాకా ఇస్తారు. ఇలా పోస్టుని బట్టీ జీతం ఉంటుంది. జనవరి 31, 2023వ తేదీలోపు ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవాల్సి వుంది. పూర్తి వివరాలని https://www.hindustancopper.com/ లో చూడచ్చు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version