ఐఐటీ మ‌ద్రాస్‌లో ఉద్యోగాలు.. వివరాలు మీకోసం..!

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. చెన్నైలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ మ‌ద్రాస్‌ ప‌లు పోస్టులని భర్తీ చేస్తోంది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. నాన్‌టీచింగ్ పోస్టులని భర్తీ చేస్తున్నారు. ప్రాజెక్ట్‌ ఆఫీసర్లు, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌లు, జూనియర్‌ టెక్నీషియన్ వంటి పోస్టులున్నాయి.

 

jobs
jobs

ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి న‌వంబ‌ర్ 14, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. కనుక ఆసక్తి వున్న వాళ్లు ఈ లోగా అప్లై చేసుకోండి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోచ్చు. షార్ట్‌ లిస్టింగ్, టెస్ట్‌/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ద‌ర‌ఖాస్తు వివ‌రాలు, నోటిఫికేష‌న్ స‌మాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ https://icandsr.iitm.ac.in/recruitment/ ను చూసి తెలుసుకోచ్చు.

పోస్టుల వివరాల లోకి వెళితే.. ప్రాజెక్ట్‌ ఆఫీసర్ల పోస్టుకి అయితే సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌ ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి. వయసు వచ్చేసి 28 ఏళ్లు మించకుండా ఉండాలి. అలానే ప్రాజెక్ట్‌ అసోసియేట్‌లు అయితే సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌ ఉత్తీర్ణతతో పాటు గేట్‌ అర్హత సాధించి ఉండాలి. వయసు 28 ఏళ్లు మించకుండా ఉండాలి. జూనియర్‌ టెక్నీషియన్ కి అయితే సంబంధిత సబ్జెక్టుల్లో ఐటీఐ/డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి. వయసు: 28 ఏళ్లు మించకుండా ఉండాలి. అధికారిక వెబ్‌సైట్ https://icandsr.iitm.ac.in/recruitment/ ను సంద‌ర్శించి అప్లై చేసుకోచ్చు.

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి.