టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు.. వివరాలివే..!

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. కన్సల్టెంట్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ సంస్థ నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు.

 

jobs
jobs

ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. మొత్తం 7 ఉద్యోగ ఖాళీలలో బ్రాడ్‌కాస్టింగ్‌ అండ్‌ కేబుల్‌ సర్వీసెస్‌, బ్రాడ్‌ బ్యాండ్‌ అండ్‌ పాలిసీ అనాలసిసీన్‌, ఫైనాన్షియల్‌ అండ్‌ ఎకనమిక్‌ అనాలసిస్‌, ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌, టెక్నాలజీ డెవపల్‌మెంట్‌ యూనిట్‌ విభాగాల్లో ఖాళీలు వున్నాయి.

ఇది ఇలా ఉంటే 32 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. సంబంధిత పనిలో అనుభవం తప్పక ఉండాలి. ఇక విద్యార్హతల వివరాల లోకి వస్తే..
గ్రాడ్యుయేషన్‌, బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్‌, మాస్టర్స్‌ డిగ్రీలో పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.

2021 సంవత్సరం జనవరి 27వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

మొదట ట్రాయ్ వెబ్ సైట్ నుంచి ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పీడీఎఫ్ ఫైల్ ను డౌన్ లోడ్ చేసుకుని ఆ ఫామ్ ను నింపాల్సి ఉంటుంది. దానిని ఈ కింది అడ్రెస్ కి పంపించాల్సి వుంది. పూర్తి వివరాలని https://www.trai.gov.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.

సీనియర్‌ రిసెర్చ్‌ ఆఫీసర్‌, ట్రాయ్‌, మహానగర్‌ దూర్‌ సంచార్‌ భవన్‌, న్యూఢిల్లీ 110002

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి.