ఇండియ‌న్ నేవీలో ఉద్యోగాలు.. వివరాలివే..!

ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఇండియన్ నేవీ లో ఖాళీలు వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు అప్లై చెయ్యచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. షార్ట్ సర్వీస్ కమిషన్ పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. మొత్తం 181 ఖాళీలను ఈ నోటిఫికేష‌న్ ద్వారా భ‌ర్తీ చేయ‌నున్నారు.

 

ఇందుకు సంబంధించిన నేవెల్ ఓరియెంటేషన్ కోర్సు జూన్ 2022లో ప్రారంభం కానుంది. అక్టోబ‌ర్ 5, 2021 వ‌ర‌కు అప్లై చెయ్యచ్చు. ఎంపిక విధానం ఇంట‌ర్వ్యూ ద్వారా ఉంటుంది. అకాడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేయనున్నారు. ఇక పోస్టుల వివరాల లోకి వెళితే.. జనరల్ సర్వీస్, అబ్సర్వర్, పైలట్, లాజిస్టిక్స్, ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ ఇలా కొన్ని పోస్టులు వున్నాయి. పోస్టులకి సంబందించిన వివరాలు, విద్యార్హతలు నోటిఫికేషన్ లో చూడచ్చు. ఇక అప్లై చేసుకునే ప్రాసెస్ చూస్తే..

అభ్య‌ర్థి ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://www.joinindiannavy.gov.in/ ను ఓపెన్ చెయ్యాలి.
ఆన్‌లైన్ అప్లికేష‌న్‌లోకి వెళ్లి వివరాలనివ్వాలి.
నెక్స్ట్ ఈ-మెయిల్‌, మొబైల్ నంబ‌ర్ కూడా ఇవ్వాలి.
విద్యార్హ‌త‌ల‌కు సంబంధించిన అన్ని డాక్యుమెంట్ల‌ను స్కాన్ కాపీ రూపంలో అప్‌లోడ్ చేయాలి.
ఫైనల్ గా అప్లికేష‌న్ ఫామ్ సబ్‌మిట్ చేయాలి.

నోటిఫికేషన్ లింక్: http://www.davp.nic.in/WriteReadData/ADS/eng_10701_10_2122b.pdf