మిలిటరీ ఇంజినీర్ సర్వీస్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

-

మిలిటరీ ఇంజినీర్ సర్వీస్ (ఎంఈఎస్)లో డ్రాఫ్ట్‌మెన్, సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంఈఎస్ రిక్రూట్‌మెంట్-2021 పేరిట 502 పోస్టుల భర్తీకి దరఖాస్తు ఆహ్వానిస్తోంది. అయితే నోటిఫికేషన్ 2021 మార్చి 22వ తేదీన విడుదల చేసినా.. ఇప్పటివరకు ఎవరూ ఈ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేయలేకపోవడం గమనార్హం. ఒకవేళ పోస్టులను అప్లై చేసుకోవాలని అనుకునేవారు మిలిటరీ ఇంజినీర్ సర్వీస్ అధికారిక వెబ్‌సైట్‌కు లాగిన్ అయి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 12వ తేదీ వరకు కొనసాగుతుంది. దరఖాస్తు గడవు తేదీ ముగిసిన తర్వాత పోస్టుల అప్లికేషన్ ఫారమ్ లింక్ వెబ్‌సైట్ నుంచి తొలగించడం జరుగుతుందని, అర్హత ఉన్న వాళ్లు తొందరగా అప్లై చేసుకోవాలని ఎంఈఎస్ తెలిపింది. కాగా, ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి 2021 మే 16వ తేదీన పరీక్ష నిర్వహిస్తారు.

మిలిటరీ ఇంజినీర్స్ సర్వీస్
మిలిటరీ ఇంజినీర్స్ సర్వీస్

దరఖాస్తు ప్రక్రియ..
డ్రాఫ్ట్‌మెన్, సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి మిలిటరీ ఇంజినీర్ సర్వీస్ (ఎంఈఎస్) అధికార వెబ్‌సైట్‌కు mesgovonline.com లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత హోమ్ పేజీ ఓపెన్ అవుతుంది. హోమ్ పేజీలో ఎడమ వైపున ఉన్న కొత్త రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి. అప్పుడు అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ డ్రాఫ్ట్‌మెన్, సూపర్‌వైజర్ లింక్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి అభ్యర్థులు తమ వివరాలు నమోదు చేయాలి. దరఖాస్తు ఫారం నింపి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. దరఖాస్తు పూర్తి చేసుకున్న తర్వాత అప్లికేషన్ హార్డ్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోవాలి.

ఖాళీ పోస్టుల వివరాలు
డ్రాఫ్ట్‌మెన్, సూపర్ వైజర్ పోస్టుల ఎంపిక రాత పరీక్ష ఆధారంగా జరుగుతుంది. మొత్తం 502 పోస్టులు ఖాళీగా ఉండగా.. 450 సూపర్‌వైజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో జనరల్ కేటగిరిలో 183 పోస్టులు, ఓబీసీ-120, ఎకనామికల్ వీకర్ విభాగంలో 45, ఎస్సీ-69, ఎస్టీ-33 పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news