ఆంధ్రా నిరుద్యోగులకు శుభవార్త… త్వరలో లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్లు

-

ఏపీ అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా అది జగన్ వల్లే అవుతుందని జనం నమ్మారు. గెలిపించారు. వాళ్ల నమ్మకాన్ని వమ్ము చేయకూడదనే జగన్ కూడా నిరుద్యోగులకు న్యాయం చేయాలని చూస్తున్నారు.

గత ఐదేళ్ల పాటు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఉద్యోగాలు ఇక ఇస్తా.. ఇక ఇస్తా.. అంటూ మభ్యపెట్టారు కానీ.. ఒక్క ఉద్యోగం ఇవ్వలేకపోయారు. జాబ్ కావాలంటే బాబు రావాలి.. అన్న నినాదంతో 2014లో ఏపీలో బాబు అధికారంలోకి వచ్చినప్పటికీ.. నిరుద్యోగులకు మాత్రం ఒక్క జాబ్ కూడా ఇవ్వలేదు.

notifications will be released for one lakh jobs in ap soon?

2019 ఎన్నికల్లోనూ మళ్లీ అదే నినాదం. జాబ్ రావాలంటే బాబు కావాలి.. అంటూ ప్రజల్లోకి వెళ్లారు బాబు. కానీ.. ఈసారి బొక్కబొర్లా పడ్డారు. ప్రజలు కర్రు కాల్చి చంద్రబాబుకు వాత పెట్టారు. దీంతో పోయి.. ప్రతిపక్షంలో కూర్చున్నారు.

ఏపీ అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా అది జగన్ వల్లే అవుతుందని జనం నమ్మారు. గెలిపించారు. వాళ్ల నమ్మకాన్ని వమ్ము చేయకూడదనే జగన్ కూడా నిరుద్యోగులకు న్యాయం చేయాలని చూస్తున్నారు.

అందుకే… ఏపీలో త్వరలో భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టాలని జగన్ భావిస్తున్నారట. ఒక ఉద్యోగం కాదు.. రెండు ఉద్యోగాలు కాదు.. వివిధ కేటగిరీల్లో దాదాపు లక్ష వరకు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

ఒకవేళ జగన్ కనుక నిజంగానే లక్ష ఉద్యోగాలకు ఒకేసారి నోటిఫికేషన్ ఇస్తే మాత్రం అది ఏపీ నిరుద్యోగులకు పండుగ లాంటి వార్తే. దేశంలోనే ఏ రాష్ట్రం కూడా చేపట్టని నియామకాలను చేపట్టి జగన్ చరిత్రలో నిలుస్తారు.

లక్ష ఉద్యోగాల నోటిఫికేషన్లలో 11 వేలు సర్వే అసిస్టెంటు ఉద్యోగాలు, 200 వీఆర్వో ఉద్యోగాలు, 10 వేల పశుసంవర్థక శాఖలో ఉద్యోగాలు, 11 వేలు గ్రామ ఇంజినీర్లు, 5 వేల విద్యుత్ లైన్ మెన్ ఉద్యోగాలకు, ఇంకా ఇతర కేటగిరీల్లోనూ నోటిఫికేషన్ వెలువడనున్నదట. ఎలాగూ ఇదివరకే గ్రామ వాలంటరీ, గ్రామ సచివాలయం పోస్టులకు నోటిఫికేషన్ రిలీజయిన సంగతి తెలిసిందే. అవి కాకనే లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్ రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news