ఆయిల్ ఇండియా లిమిటెడ్‌ 535 ఖాళీలు..ఇలా అప్లై చెయ్యండి..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఆయిల్ ఇండియా లిమిటెడ్ తాజాగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్‌లో నిర్వహిస్తున్న పనుల కోసం పలు పోస్టుల్ని ఆయిల్ ఇండియా లిమిటెడ్ భర్తీ చేస్తోంది.

jobs
jobs

దీనిలో మొత్తం 535 ఖాళీలు వున్నాయి. అస్సాం లోని దులియాజన్‌లో గల ఫీల్డ్ హెడ్‌క్వార్టర్స్‌లో ఈ పోస్టులున్నాయి. ఇందులో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెషినిస్ట్ లాంటి పోస్టులు ఉన్నాయి. ఇక విద్యార్హత చూస్తే… వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. పోస్టులను బట్టి టెన్త్‌, ఇంటర్మీడియట్‌, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ అయిన వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

ఇక వయస్సు అయితే..జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 18 నుంచి 30 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 18 నుంచి 33 ఏళ్లు, ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు 18 నుంచి 35 ఏళ్లు ఉండాలి. అలాగే పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరితేది సెప్టెంబర్ 23, 2021. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా సెలెక్ట్ చేస్తారు. పోస్టులను బట్టి శాలరీ రూ.26,600 – 90,000 వరకూ ఉంటుంది. అభ్యర్థులు పూర్తి వివరాలను https://www.oil-india.com/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

పోస్టుల వివరాలు:

ఎలక్ట్రీషియన్ – 38
ఫిట్టర్- 144
మెకానిక్ మోటార్ వెహికిల్- 42
మెషినిస్ట్- 13
మెకానిక్ డీజిల్ ట్రేడ్- 97
ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ట్రేడ్- 40
బాయిలర్ అటెండెంట్- 8
టర్నర్- 4
డ్రాఫ్ట్స్‌మ్యాన్ సివిల్- 8
ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్- 81
ఎంపీసీ- 44
సర్వేయర్- 5
వెల్డర్‌- 6
ఐటీ ట్రేడ్- 5

 

Read more RELATED
Recommended to you

Latest news