పెరిగిన ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ పోస్టుల సంఖ్య!

-

బ్యాంక్‌ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న వారికి ఓ గుడ్‌ న్యూస్‌. ఇది వరకే ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పోస్టుల సంఖ్యను పెంచింది. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌ దేశవ్యాప్తంగా బ్యాంకు ఖాళీలను భర్తీ చేస్తోంది. అయితే ఈ సారి రీజనల్‌ రూరల్‌ బ్యాంకుల్లో ఉద్యోగాల్ని భారీ స్థాయిలో భర్తీ చేస్తోంది. ఇందులో మల్టీపర్సస్‌ అసిస్టెంట్, ఆఫీసర్‌ స్కేల్‌ 1,2,3 ఉన్నాయి. ముందుగా నోటిఫికేషన్‌ ప్రకారం 10 వేల పోస్టుల భర్తీ అని ప్రకిటించింది. ప్రస్తుతం వాటి సంఖ్యను 12,958కు పెంచింది. అంటే నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత దాదాపు మూడువేల పోస్టులను పెంచేసింది. ఇందులో ఆఫీస్‌ అసిస్టెంట్‌ సంఖ్యతోపాటు ఆఫీసర్‌ స్కేల్‌ పోస్టుల సంఖ్య కూడా పెంచింది.


దరఖాస్తు ప్రక్రియ జూన్‌ 8న ప్రారంభమైంది. జూన్‌ 28 చివరి తేదీ. మిగతా వివరాలు ఐబీపీఎస్‌ అధికారిక వెబ్‌సైట్‌ https://www.ibps.in/ లో చూడవచ్చు. ఆగస్టులో ప్రిలిమ్స్, సెప్టెంబర్‌ –అక్టోబర్‌లో మెయిన్‌ లేదా సింగిల్‌ ఎగ్జామ్‌ ఉంటుంది. అక్టోబర్‌ లేదా నవంబర్‌లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. 2022 జనవరి నాటికి నియామక ప్రక్రియ పూర్తవుతుంది.ఐబీపీఎస్‌ ఈ ఎగ్జామ్స్‌ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంకు, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, తెలంగాణలోని ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంకుల్లో పోస్టులను భర్తీ చేయనుంది. విద్యార్హతల విషయానికి వస్తే.. వేర్వేరు పోస్టులకు వివిధ విద్యార్హతలున్నాయి. ఆఫీసర్‌ స్కేల్‌ 1, 2, 3, ఆఫీస్‌ అసిస్టెంట్‌ పోస్టులకు డిగ్రీ, ఎంబీఏ లాంటి కోర్సులు పూర్తిచేసినవారు దరఖాస్తు చేయొచ్చు. దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు ఓసారి అధికారిక వెబ్‌సైట్‌ను పూర్తిగా చదివిన తర్వాతే దరఖాస్తు చేసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news