యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో ఉద్యోగాలు… ఇలా అప్లై చెయ్యండి..!

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. హైదరాబాద్ లోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చెయ్యచ్చు. ఇక ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

దీనిలో మొత్తం 52 ఖాళీలున్నాయి. ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ , అసోసియేట్ ప్రొఫెసర్విభాగాల్లో ఈ ఖాళీలు వున్నాయి. ఆన్లైన్ లేదా ఆఫ్ లైన్ విధానంలో అప్లై చెయ్యచ్చు. ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులను పంపడానికి డిసెంబర్ 12 ఆఖరి తేదీ. ఇక పోస్టుల వివరాల లోకి వెళితే.. ప్రొఫెసర్లు 16, అసోసియేట్ ప్రొఫెసర్లు 31, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 05.

ఇక ఖాళీలు సెక్షన్ లోకి వెళితే.. మాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్, స్కూల్ ఆఫ్ కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో కెమిస్ట్రీ, ప్లాన్ సైన్సెస్, అనిమల్ బయాలజీ, ఇంగ్లిష్, తెలుగు, హిందీ, ఉర్దూ, ఎకనామిక్స్ మొదలైన విభాగాల్లో ఖాళీలు వున్నాయి. ఇక శాలరీ విషయానికి వస్తే ప్రొఫెసర్స్ కి నెలకు రూ.1,44,200-రూ.2,18,200 వరకు ఇస్తారు.

అసోసియేట్ ప్రొఫెసర్స్ కి నెలకు రూ.1,32,400-రూ.2,17,100 వరకు ఇస్తారు. అదే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కి అయితే రూ.57,700-రూ.1,82,400 వరకు ఇస్తారు. విద్యార్హతలు వేర్వేరుగా వున్నాయి. టీచింగ్ లేదా రీసెర్చ్ లో అనుభవం కూడా ఉండాలి. పూర్తి వివరాలని మీరు నోటిఫికేషన్ లో చూసి అప్లై చెయ్యచ్చు. https://uohyd.ac.in/teaching-guest-faculty/