బార్క్‌లో ఖాళీలు.. రూ.78,000 జీతం..ఇలా అప్లై చేసుకోండి..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. కోల్‌కతాలోని భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ లో పలు ఖాళీలు వున్నాయి. 51 మెడికల్, సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులు వున్నాయి. పూర్తి వివరాలలోకి వెళితే.. ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలంటే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి BVSc & AH/MBBS/MS/MD/DNB ప్యాస్ అయ్యి ఉండాలి.

అలానే అర్హత సాధించిన వారికి నెలకు రూ.56,100ల నుంచి రూ.78,800ల వరకు జీతం ఇస్తారు. ఈ పోస్టులకు అప్లై చెయ్యడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30, 2022. పోస్టుల వివరాలను చూస్తే.. మెడికల్/సైంటిఫిక్ ఆఫీసర్ 15 పోస్టులు, టెక్నికల్ ఆఫీసర్-సి 35 పోస్టులు వున్నాయి.

రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 50 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత ఉంటే అప్లై చేసుకోవచ్చు. కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి. మాక్సిమం 35 ఏళ్ల నుంచి 50 ఏళ్లు ఉండచ్చు. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. స్క్రీనింగ్ పరీక్ష కూడా ఉండచ్చు. ఇక దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే.. మెడికల్ సైంటిఫిక్ ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేసుకునే వారు రూ. 500 చెల్లించాలి. ఆన్ లైన్ ద్వారా ఎంపిక చేసుకోవచ్చు. barc.gov.inలో పూర్తి వివరాలను చూడచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news