‘పది’లో ఇక ‘ఆరు’పేపర్లేనా..?

-

పదో తరగతిలో గతంలో 11 పరీక్షలు రాయాల్సి ఉండేది. కానీ.. ప్రస్తుతం 6 మాత్రమే ఉండేలా విద్యాశాఖ కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. కచ్చితంగా రూపేణా పరీక్షలు నిర్వహించాలని డిసైడైంది. విద్యాశాఖ ప్రత్యక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ నేతృత్వంలో నవంబర్‌లో జరిగిన సమావేశంలో మే రెండో వారం నుంచి పరీక్షలు నిర్వహించాలలి నిర్ణయించారు. మునుపటి లాగా పరీక్షలు నిర్వహిస్తే అస్సలే తరగతులు జరగకపోవడంతో విద్యార్థులు అధిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని అధికారులు విశ్లేషించారు.

గతంలో హిందీకి రెండు పరీక్షలు, మిగతా వాటిలో ఒక్కటి మాత్రమే ఉండేది. ప్రస్తుతం అన్నీ పరీక్షలు ఇక్కొక్కటే ఉండనున్నట్లు తెలిసింది. అంతేకాక చాయీస్‌లోనూ ప్రశ్నల సంఖ్య పెంచితే విద్యార్థులకు సులువుగా ఉంటుందని పేర్కొంటున్నారు. మన రాష్ట్రంలో దాదాపుగా 5.50 లక్షలు మంది ‘పది’ విద్యార్థులు ఉన్నారు. తరగతులు ప్రారంభమైన తర్వాత పని దినాలను లెక్కలు వేసుకొని ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు అధికార యంత్రాంగం చెబుతోంది.

సంక్రాంతి అనంతరం..

పాఠశాలలు పునః ప్రారంభించడానికి విద్యాశాఖ ఆలోచనలు ఒక్క అడుగు ముందుకు, మూడడుగులు వెనక్కి అన్నట్లు ప్రతిపాదనలు మారుతూనే ఉన్నాయి.సంక్రాంతి పండగ తర్వాతో పది, తొమ్మిది విద్యార్థులకు తరగతి గదుల్లో కూర్చొబెట్టి పాఠాలు బోధించనున్నట్లు ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నట్లు తెలిసింది. ఒకవేళ సంక్రాంతి తర్వాత తెరిచినా కూడా విద్యార్థులకు కేవలం నాలుగు నెలల సమయం ఉంటుంది. ఆ సమయంలో అన్ని సబ్జెక్ట్‌లపై పట్టు సాధిస్తారా..? అనే మరో సందేహం తలెత్తుతోంది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఆదేశాల మేరకు ఎన్ని రాష్ట్రాలో పాఠశాలలను కొనసాగిస్తున్నారో.. ఈనే వివరాలను అధికారులు సేకరించారు. ప్రస్తుతం దేశంలో ఏడు రాష్ట్రాల్లో ప్రత్యేక్ష బోధన జరుగుతున్నట్లు గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news