చీరాల మత్స్యకార గ్రామాల్లో టెన్షన్ టెన్షన్.. భారీగా పోలీసుల మోహరింపు !

-

చీరాల తీర ప్రాంతంలో అడిషనల్ ఎస్పీ రవిచంద్ర ఆధ్వర్యంలో పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది. ఇప్పటికీ తీర ప్రాంత గ్రామాలు ఉద్రిక్తతల నడుమనే ఉన్నాయి. ఇప్పటికి మత్స్యకారుల మధ్య సయోధ్య కుదరలేదు. నిన్న అర్ధరాత్రి వరకు చీరాల వన్ టౌన్ స్టేషన్ లో తీర ప్రాంత పరిస్థితిపై పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ సమీక్షించారు. ఇవాళ వాడరేవు, కటారివారిపాలెం సందర్శించే అవకాశం కనిపిస్తోంది.

నిన్న వాడరేవు గ్రామానికి చెందిన 11 మంది మత్స్యకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. కఠారివారిపాలెం, రామాపురం మత్స్యకారుల పడవలపై దాడి చేసిన ఘటనలో ఇప్పటి వరకు 15 మంది వాడరేవు మత్స్యకారులు అరెస్ట్ అయ్యారు. ఇక వాడరేవు గ్రామంపై దాడి చేసిన ఘటనలో ఇప్పటికే 16 మంది కఠారివారిపాలెం మత్స్యకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఒకరంగా రెండు గ్రామాలలో పెద్ద ఎత్తున పోలీసులు మొహరించారు.

Read more RELATED
Recommended to you

Latest news