నిరుద్యోగులకు పవర్‌గ్రిడ్‌ గుడ్‌న్యూస్‌!

-

పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ తాజా నియామకాలు చేపట్టింది. ట్రైనీ విభాగంలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సదరన్‌ రీజియన్‌ ట్రాన్స్‌మిషన్‌లో ఈ ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్‌లో తెలిపారు. ఆ వివరాలు తెలుసుకుందాం. అభ్యర్థులను రాత పరీక్ష, కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామ్‌ ద్వారా ఎంపిక చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.27,500 వేతనం చెల్లించనున్నారు. ఆ తర్వాత రూ.25 వేల నుంచి రూ.1.70 లక్షలుగా నిర్ణయించారు. తదితర వివరాలకు అభ్యర్థులు నోటిఫికే షన్‌ను చూడవచ్చు.


మొత్తం ఖాళీలు..35

దీనికి 3 ఏళ్ల డిప్లొమా కోర్సును గుర్తింపు పొందిన టెక్నికల్‌ బోర్డు లేదా సంస్థ నుంచి చేసిన వారు అర్హులు. అలాగే.. దరఖాస్తుదారడు సంబంధిత విభాగంలో 70 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ,పీడబ్ల్యూడీ, అభ్యర్థులు పాస్‌ అయ్యి.. ఈ కింది స్ట్రీమ్‌ లలో డిప్లొమో చేసి ఉండాలి.

  1. ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌
  2. ఎలక్ట్రికల్‌(పవర్‌) ఇంజినీరింగ్‌
  3. పవర్‌ ఇంజినీరింగ్‌(ఎలక్ట్రికల్‌)
  4. ఎలక్ట్రికలల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌
  5. పవర్‌ సిస్టం ఇంజినీరింగ్‌

బీటెక్, ఎంటెక్‌ విద్యార్హత కలిగి డిప్లొమో చేసిన వారు ఈ ఉద్యోగాలకు అనర్హులు. అభ్యర్థుల వయస్సు 27 ఏళ్లు ఉండాలి. ఓబీసీలకు 30 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 32 ఏళ్లను వయో పరిమితిగా నిర్ణయించారు. ఎంపికైన అభ్యర్థులకు మెడికల్‌ టెస్ట్‌ లు నిర్వహించి ఫిట్‌ గా ఉన్నట్లు తేలితేనే విధుల్లోకి తీసుకుంటారని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 29 రాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news