తెలంగాణ‌లో ఎంసెట్, ఇత‌ర ప్ర‌వేశ ప‌రీక్ష‌లు జ‌రిగే తేదీలు ఇవే..!

క‌రోనా లాక్‌డౌన్ నేప‌థ్యంలో వాయిదా ప‌డ్డ ప‌రీక్ష‌ల‌న్నింటినీ నెమ్మదిగా మ‌ళ్లీ నిర్వ‌హించేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. అందులో భాగంగానే మొద‌ట సీబీఎస్ఈ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ తేదీల‌ను ప్ర‌క‌టించారు. ఇక తెలంగాణ‌లో 10వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల తేదీల‌ను కూడా వెల్ల‌డించారు. ఈ క్ర‌మంలోనే రాష్ట్ర ప్ర‌భుత్వం త్వ‌ర‌లో ఎంసెట్ జ‌ర‌గ‌నున్న తేదీల వివ‌రాల‌ను కూడా తెలియ‌జేసింది.

telangana eamcet and other entrance tests dates announced

తెలంగాణ‌లో ఎంసెట్ ప్ర‌వేశ ప‌రీక్ష తేదీల‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి తాజాగా ప్ర‌క‌టించారు. జూలై 6 నుంచి 9వ తేదీ వ‌ర‌కు ప‌రీక్ష‌లు జ‌రుగుతాయ‌ని తెలిపారు. రాష్ట్ర ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ పాపిరెడ్డి, కాలేజ్ ఎడ్యుకేష‌న్ క‌మిష‌న‌ర్ న‌వీన్ మిట్ట‌ల్‌, వైస్ చైర్మ‌న్లు ప్రొఫెస‌ర్ ఆర్‌. లింబాద్రి, వి.వెంక‌ట ర‌మ‌ణ‌ల‌తో ఆమె రాష్ట్రంలో నిర్వ‌హించాల్సిన ప‌లు ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌కు సంబంధించి శ‌నివారం స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు.

కాగా యూజీసీ సూచ‌న‌ల మేరుకు క‌రోనా జాగ్ర‌త్త చ‌ర్య‌ల‌ను పాటిస్తూ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్నామ‌ని మంత్రి స‌బితా రెడ్డి తెలిపారు. ప‌రీక్ష‌ల సంద‌ర్భంగా అన్ని జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎం కేసీఆర్ ఆదేశించార‌ని తెలిపారు. అందులో భాగంగానే వివిధ ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన తేదీల వివ‌రాల‌ను ఆమె ప్ర‌క‌టించారు.

* జూలై 6 నుంచి 9వ తేదీ వ‌ర‌కు తెలంగాణ ఎంసెట్ జ‌రుగుతుంది.

* జూ 4న తెలంగాణ ఈసెట్ ప‌రీక్ష ఉంటుంది.

* జూలై 10 లాసెట్ నిర్వ‌హిస్తారు.

* జూలై 1 నుంచి 3వ తేదీ వ‌ర‌కు టీఎస్‌పీజీఈసెట్ ఉంటుంది.

* జూలై 1న టీఎస్ పాలిసెట్ నిర్వ‌హిస్తారు.

* జూలై 13వ తేదీన ఐసెట్ ఉంటుంది.

* జూలై 15న ఎడ్‌సెట్ నిర్వ‌హిస్తారు.