తెలంగాణ నిరుద్యోగులకు అదిరిపోయే అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇప్పటికే పలు శాఖల్లో ఉన్న ఖాళీలను ఇప్పటికే భర్తీ చేసిన సంగతి తెలిసిందే.. ప్రభుత్వ శాఖలలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఈ మేరకు హైకోర్టులో ఇటీవల వరుసగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మరో నోటిఫికేషన్‌ను జారీ చేసింది.తెలంగాణ స్టేట్ జ్యుడీషియల్ సర్వీసులో సివిల్ జడ్జి(జూనియర్ డివిజన్) పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.. మొదలగు పూర్తి సమాచారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఖాళీలు, అర్హతలు..
మొత్తం ఖాళీలు : 10 సివిల్ జడ్జి పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన 08 ఖాళీలు, బదిలీల ద్వారా 2 ఖాళీలు భర్తీ కానున్నాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల అర్హతలు:
న్యాయశాస్త్రంలో బ్యాచిలర్స్ డిగ్రీ. మూడేళ్ల పాటు అడ్వకేట్ లేదా ప్లీడర్‌గా ప్రాక్టీస్ చేసి ఉండాలి.
వయసు: 23 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి..
పూర్తి వివరాలు :
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.అభ్యర్థులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, రాత పరీక్ష, వైవా-వాయిస్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ. 77,840 నుంచి రూ. 1,36,520 వరకు చెల్లిస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ గడువు 01-03-2023 తో ముగియనుంది.. వీటి గురించి పూర్తి సమాచారన్ని అధికారిక వెబ్ సైట్ ద్వారా తెలుసుకోగలరు..